ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో అంటే( uninterrupted) వినోదానికి పేరుగాంచింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. ఇకపై సినిమాలు, వెబ్ సిరీస్‌లు మధ్యలో ప్రకటనలు కనిపించనున్నాయి. సంస్థ ప్రకటించిన తాజా మార్గదర్శకాలు వినియోగదారులపై ప్రత్యక్షంగా ప్రభావం చూపే అవకాశం ఉంది.జూన్ 17 నుంచి (From June 17) కొత్త విధానం అమలులోకి వస్తుందని అమెజాన్ స్పష్టం చేసింది. ప్రతి గంటకు ఆరు నిమిషాల పాటు ప్రకటనలు ప్రసారం చేయనున్నట్లు పేర్కొంది. అంటే మీరు 2 గంటల సినిమా చూస్తే దాదాపు 12 నిమిషాలు ప్రకటనలతో పోతుంది. ఇది వినియోగదారులకు కొంత అసౌకర్యంగా మారవచ్చు.
యాడ్ లేని ప్రీమియం ప్లాన్ ధరలు ఇవే
ప్రకటనలు లేకుండా (uninterrupted) కంటెంట్ ఆస్వాదించాలనుకునే వారు ప్రత్యేక ప్యాక్ తీసుకోవాలి. నెలకు రూ.129, సంవత్సరానికి రూ.699 చెల్లించి కొత్త ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ధరలు ప్రస్తుతం ఉన్న ప్రైమ్ మెంబర్‌షిప్‌కి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో అధికంగా ఒరిజినల్ కంటెంట్‌పై పెట్టుబడి పెట్టాలనే ఉద్దేశం ఈ నిర్ణయానికి కారణమని అమెజాన్ తెలిపింది. వినియోగదారులకు మరింత విభిన్నమైన వెబ్‌సిరీస్‌లు, సినిమాలు అందించాలన్నదే సంస్థ లక్ష్యమని చెప్పింది.
వినియోగదారుల స్పందనే కీలకం
ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ వంటి వేదికలు ప్రకటనల లేని సేవలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ తాజా నిర్ణయం వినియోగదారులకు నచ్చుతుందా లేదా అనేది వేచి చూడాలి. ప్రతిసారీ ప్లాన్ మార్చడం వినియోగదారులకు అంతసులభం కాదు కాబట్టి, ఇది ఓటీటీ పోటీపై ప్రభావం చూపే అవకాశముంది.
Read Also : Mahatma Gandhi : మహాత్మాగాంధీ మునిమనమరాలికి జైలుశిక్ష