Omar Abdullah sworn in as Jammu and Kashmir CM

జమ్మూకశ్మీర్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్ నూతన ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రమాణ స్వీకారం చేయించారు. ఒమర్ అబ్దుల్లాతోపాటు ఐదుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా సురేంద్ర చౌదరి ప్రమాణ స్వీకారం చేయగా.. జావేద్ దార్, సకినా ఇట్టు, జావేద్ రానా, సతీష్ శర్మలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భారత కూటమి నేతలు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, సుప్రియా సూలె, అఖిలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాణ స్వీకారానికి ముందు మీడియాతో మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా .. కొత్తగా ఏర్పాటవుతున్న తమ ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. జమ్ము కశ్మీర్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేశాక.. ప్రమాణ స్వీకారం చేస్తున్న తొలి ముఖ్యమంత్రిని తానేనన్నారు. గడిచిన పదేళ్లలో జమ్ము కశ్మీర్ ప్రజలు చాలా కష్టాలను ఎదుర్కొన్నారని, తమ ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో ఎప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు.

కాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 29, కాంగ్రెస్ కు 6, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ 3, పీపుల్ కాన్ఫరెన్స్ కు 1, సీపీఐ(ఎం) 1 స్థానాల్లో గెలిచాయి. కాగా.. జమ్ము కశ్మీర్ ను కేంద్రంలో ఉన్న బీజేపీ 2019, ఆగస్టు 5న కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించింది. జమ్ము కశ్మీర్, లడఖ్ గా విభజించి రాష్ట్రపతి పాలన విధించింది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇటీవల జరిగిన జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 42 స్థానాల్లో విజయం సాధించగా.. నలుగురు స్వతంత్రులు, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

Related Posts
విశాఖ డ్రగ్స్ కేసు: సీబీఐ ప్రకటన కలకలం
vizag drags case

విశాఖపట్నం పోర్టుకు బ్రెజిల్ నుంచి 25,000 టన్నుల డ్రగ్స్ వచ్చినట్టు ఆరోపణలపై గతంలో పెద్ద చర్చ జరిగింది. ఈ కేసు రాజకీయంగా పెద్ద ఎత్తున దుమారం రేపింది. Read more

TGRTCకి సంక్రాంతి సీజన్‌లో కాసుల వర్షం
Sankranti Brought Huge Reve

సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ (TGRTC) ప్రత్యేక బస్సులు నడిపి భారీ ఆదాయాన్ని సమకూర్చుకుంది. పండుగ సంబరాల కోసం 6 వేల ప్రత్యేక బస్సులను అందుబాటులోకి Read more

ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (IITF)..
india international trade fair

ప్రతీ సంవత్సరం, ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ (IITF) ఒక విశాలమైన వాణిజ్య మరియు సాంస్కృతిక ప్రదర్శనగా ప్రగ్యతి మైదాన్, ఢిల్లీ లో నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం, Read more

బాలీవుడ్‌ న‌టుడు గోవిందాకు బుల్లెట్ గాయాలు
actor govind

బాలీవుడ్‌ నటుడు, శివసేన లీడర్‌ గోవిందా ఇంట్లో గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. ఇవాళ తెల్ల‌వారుజామున 4.45 గంట‌ల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *