రీసైక్లింగ్ పేరుతో బ్రిటన్ నుంచి భారీగా ఇండియాకు వస్తున్న పాత టైర్లు!

Britain: రీసైక్లింగ్ పేరుతో బ్రిటన్ నుంచి భారీగా ఇండియాకు వస్తున్న పాత టైర్లు!

ప్రతి ఏడాది కొన్ని లక్షల పాత టైర్లు రీసైక్లింగ్ పేరుతో బ్రిటన్ నుంచి భారతదేశానికి చేరుకుంటున్నాయి. వాటిని ఫర్నేస్‌లలో కాల్చేస్తున్నారు. దీనివల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, పర్యావరణానికి నష్టం కలుగుతుం ది. బ్రిటన్‌ నుంచి వచ్చే పాత టైర్లలో ఎక్కువ భాగం ఇండియన్ బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారని, పరిశ్రమలో దీని గురించి తెలియనివారు ఎవరూ లేరని బ్రిటన్‌లోని అతిపెద్ద టైర్ రీసైక్లింగ్ ప్లాంట్ ‘రబ్బర్ వరల్డ్’ యజమాని ఎలియట్ మాసన్ అన్నారు. బ్రిటన్‌ ఇలా పాత టైర్లను ఎగుమతి చేస్తూ నియమాలను ఉల్లఘింస్తూ వస్తోందని టైర్ రికవరీ అసోసియేషన్ (టీఆర్ఏ)తో సహా పరిశ్రమలోని చాలామంది ఆరోపిస్తున్నారు.

రీసైక్లింగ్ పేరుతో బ్రిటన్ నుంచి భారీగా ఇండియాకు వస్తున్న పాత టైర్లు!

భారత్‌లోని గ్రామాల్లో పాత టైర్లను కాల్చే ప్లాంట్‌లు…
ఈ పాత టైర్లు భారత్‌లో చట్టబద్ధంగా నడుస్తున్న రీసైక్లింగ్ కేంద్రాలకు వెళుతున్నాయని అధికారిక పత్రాల్లో ఉంటుంది. కానీ ఈ టైర్లు పైరోలిసిస్ ప్లాంట్లకి చేరుతాయి. అధికారిక పత్రాల్లో పేర్కొన్నట్టు వాస్తవానికి రీసైక్లింగ్ ప్లాంట్లల్లో పాత టైర్లను చిన్న చిన్న ముక్కలుగా చేస్తారు. ఆక్సిజన్ లేని వాతావరణంలో, దాదాపు 500C ఉష్ణోగ్రత వద్ద టైర్లను కాల్చుతారు. దీని నుంచి ఉక్కు, కొద్ది మొత్తంలో నూనె, వివిధ పరిశ్రమలలో ఉపయోగించే కార్బన్ బ్లాక్‌ కూడా వస్తుంది. ముంబైలోని వాడా ప్రదేశాలలో క్షీణిస్తున్న వృక్షసంపద, మసి, కలుషితమైన జలాలు ఉన్నాయి. దగ్గు, కంటి సమస్యలతో బాధ పడుతున్నామని గ్రామస్థులు చాలాకాలంగా ఫిర్యాదు చేస్తున్నారు.

రీసైక్లింగ్ పేరుతో బ్రిటన్ నుంచి భారీగా ఇండియాకు వస్తున్న పాత టైర్లు!

2,000 వరకు పైరోలైసిస్ ప్లాంట్లు: ఇలా భారతదేశంలో 2,000 వరకు పైరోలైసిస్ ప్లాంట్లు ఉన్నాయని పర్యావరణ ఉద్యమకారుడు ఒకరు అన్నారు. వీటిలో దాదాపు సగం ప్లాంట్లు లైసెన్స్ లేనివేనని ఆయన అన్నారు. ఇదే వాడాలో ఈ ఏడాది జనవరిలో ఒక ప్లాంట్‌లో పేలుడు జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పిల్లలు మరణించారు. ఆ ప్లాంట్ యూరోప్ దేశాల నుంచి వచ్చిన టైర్లను ప్రాసెస్ చేస్తోంది. పేలుడు తర్వాత, ఒక బహిరంగ సమావేశం జరిగింది.

Related Posts
సంప‌న్నుల ఆధిప‌త్యంపై జో బైడెన్ వార్నింగ్
joe biden

త్వరలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడుగా ప్రమాణం చేయనున్న సమయంలో జో బైడెన్‌ సంప‌న్నుల ఆధిప‌త్యంపై వార్నింగ్ ఇచ్చారు. అమెరికాలో సంప‌న్నుల ఆధిప‌త్యం పెరుగుతోంద‌ని జో బైడెన్‌ ఆందోనళ Read more

ఢిల్లీ సీఎం పై కొనసాగుతున్న ఉత్కంఠ
ఢిల్లీ సీఎం పై కొనసాగుతున్న ఉత్కంఠ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం: పర్వేశ్ వర్మ ముఖ్యమంత్రి 2025 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించి, Read more

అమెరికాలో ఇన్ కమ్ ట్యాక్స్ రద్దుకు ట్రంప్ నిర్ణయం?
అమెరికా ఎన్నికల వ్యవస్థలో మార్పులకు ట్రంప్ శ్రీకారం

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అమెరికా ఫస్ట్ నినాదంతో పాలిస్తానని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మరో సంచలనానికి తెరదీశారు. త్వరలో Read more

BJP chief: ఈ నెలాఖరికి బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం!
ఈ నెలాఖరికి బీజేపీకి కొత్త అధ్యక్షుడి నియామకం!

ఏప్రిల్‌ చివరి నాటికి భారతీయ జనతాపార్టీకి నూతన జాతీయ అధ్యక్షుడు ఎన్నిక కానున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాలు ముగిసిన వెంటనే అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ప్రారంభం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *