అమెరికా ఎన్నికల వ్యవస్థలో మార్పులకు ట్రంప్ శ్రీకారం

అమెరికాలో ఇన్ కమ్ ట్యాక్స్ రద్దుకు ట్రంప్ నిర్ణయం?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక అమెరికా ఫస్ట్ నినాదంతో పాలిస్తానని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా మరో సంచలనానికి తెరదీశారు. త్వరలో దేశంలో ఆదాయపు పన్ను రద్దు చేయాలని ట్రంప్ నిర్ణయించారు.ఈ మేరకు సంకేతాలు ఇచ్చేశారు. దీని స్ధానంలో ఏ చేయబోతున్నారో కూడా అమెరికన్లకు చెప్పేశారు. దీంతో ట్రంప్ నిర్ణయాలు అమెరికన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అమెరికా పౌరులకు ప్రస్తుతం విధిస్తున్న ఆదాయపు పన్నును తొలగించబోతున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చేశారు. వ్యక్తులు, కుటుంబాల ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. తమను ధనవంతులుగా చేసిన అమెరికాను పునరుద్ధరించే దిశగా ఈ చర్య తీసుకోబోతున్నట్లు వెల్లడించారు.

Advertisements

ప్రస్తుతం అమెరికా ఆర్ధిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ఆదాయపు పన్నును పూర్తిగా రద్దు చేసి, దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా ఈ లోటు పూడ్చుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు. విదేశాలను సుసంపన్నం చేయడానికి మన పౌరులపై పన్ను విధించే బదులు, మన పౌరులను సుసంపన్నం చేయడానికి విదేశీ దేశాలపై పన్ను విధించాలని అమెరికా అధ్యక్షుడు హౌస్ రిపబ్లికన్ సభ్యుల కాన్ఫరెన్స్‌లో తన పన్ను సంస్కరణ ప్రణాళికలను బయటపెట్టారు. అలాగే అమెరికాలో బహుముఖ పన్నుల తగ్గింపుల కోసం ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రతిపాదిత తగ్గింపుల నుండి రాబడి లోటును భర్తీ చేయడానికి దిగుమతి సుంకాలను వాడుకోవాలని భావిస్తున్నారు. అలాగే దిగుమతి సుంకాల నిర్వహణను పర్యవేక్షించడానికి ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు.

Related Posts
పలు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లపై ట్రంప్‌ సంతకాలు
trump

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టారు. శ్వేత సౌధంలోకి అడుగుపెట్టగానే తనదైన స్టైల్లో పాలనను మొదలు పెట్టారు. తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే కార్యనిర్వాహక Read more

సమర్థులైన వ్యక్తులే మాకు అవసరం: ట్రంప్
trump

అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ మున్ముందు పలు ఛాలెంజ్ విధానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిన్న డొనాల్డ్ ట్రంప్ H-1B లపై మాట్లాడుతూ H-1B విదేశీ Read more

కలిసి పనిచేద్దాం : భారత్‌కు చైనా పిలుపు
Let's work together.. China call to India

బీజింగ్‌ : నిన్న మొన్నటి వరకు భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూసిన చైనా ఇప్పుడు స్వరం మార్చింది. ట్రంప్ సుంకాల పెంపుతో చిక్కుల్లో పడే ఛాన్స్ ఉండటంతో Read more

భారత జట్టు పై షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
భారత జట్టు పై షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

దుబాయ్‌లో ఆదివారం జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ క్రికెట్ ప్రపంచాన్ని ఉత్కంఠకు గురి చేస్తోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ Read more

×