Officer On Duty Review : ఈ రోజు నుంచే మొదలైన స్ట్రీమింగ్ : నెట్ ఫ్లిక్స్ మలయాళ నటుడు కుంచాకో బోబన్‌కు అక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది ఆయన హీరోగా నటించిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ సినిమా, ఫిబ్రవరి 20న మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధించింది.జీతూ అష్రాఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 12 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూలు చేసింది.ఈ విజయం తర్వాత ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.ఈ నెల 14న తెలుగు వెర్షన్ విడుదలైంది. అయితే సరైన ప్రచారం లేకపోవడం వల్ల సినిమాకి ప్రేక్షకాదరణ అంతగా లభించలేదు.థియేటర్లలో పెద్దగా గుర్తింపు పొందకపోయినప్పటికీ ఇప్పుడు ఈ సినిమా ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. పోలీస్ ఆఫీసర్ హరిశంకర్ (కుంచాకో బోబన్) సస్పెన్షన్ తర్వాత తిరిగి విధుల్లో చేరుతాడు. ఈ క్రమంలో అతని వద్దకు నకిలీ గోల్డ్ చైన్ కేసు వస్తుంది.ఇది ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో కండక్టర్‌గా పనిచేసే చంద్రమోహన్ కూతురికి సంబంధించినది.కేసు దర్యాప్తు ప్రారంభించిన హరిశంకర్‌కు, ఆమెపై అనుమానం కలుగుతుంది.ఈ అనుమానం మరింత ముదరడంతో, కేసును లోతుగా తవ్వడం ప్రారంభిస్తాడు.దర్యాప్తు సాగుతున్న కొద్దీ, హరిశంకర్ ముందు ముగ్గురు యువతుల ఆత్మహత్యల కేసులు వస్తాయి.

ఒక్కో గోల్డ్ చైన్ ఒక్కో ఆత్మహత్యతో ముడిపడి ఉంటుంది. చంద్రమోహన్ కూతురితో పాటు మరో ఇద్దరు యువతులు పోలీస్ అధికారుల కుమార్తెలే కావడం అతనిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మూడు యువతుల ఆత్మహత్యల వెనక ‘శ్యామ్’ అనే యువకుడి పాత్ర ఉందని అతను అనుమానిస్తాడు. శ్యామ్‌ను విచారించడానికి ప్రయత్నిస్తే, అనుకోని ఘటన చోటుచేసుకుని అతను మరణిస్తాడు. ఇక్కడ అసలు మిస్టరీ మొదలవుతుంది. శ్యామ్ నిజంగా నేరస్తుడేనా ఈ వరుస ఆత్మహత్యలకు, ఆ గోల్డ్ చైన్లకు ఉన్న సంబంధం ఏమిటి శ్యామ్ మరణంతో కథ ముగిసిందనుకుంటే, అసలు నిజం బయటపడుతుందా హరిశంకర్ ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడు అనే ఆసక్తికర మలుపులతో కథ ఉత్కంఠగా సాగుతుంది.
సినిమా ఒక చిన్న కేసుతో మొదలై, అంచెలంచెలుగా ఆసక్తికర మలుపులతో ముందుకు సాగుతుంది. సాధారణంగా ఈ తరహా కథల్లో ప్రేక్షకులు ముందే అంచనా వేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ చిత్రంలో అసలు కథ ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టమే. ప్రతి సన్నివేశంలోనూ కొత్త ట్విస్ట్‌లు ఉండటం థ్రిల్లింగ్ అనుభూతిని కలిగిస్తుంది. ఇంటర్వెల్‌కు చేరేసరికి కథ ఒక కీలక మలుపు తిరుగుతుంది. అప్పటివరకు నేరపూరిత సంఘటనలు ఓ ముగింపుకు వచ్చాయని అనుకున్న ప్రేక్షకులకు, అంతటితో కథ ముగిసిపోలేదనే ఆసక్తిని కలిగించగలిగారు దర్శకుడు. నేరస్థులు ఎలా పనిచేస్తున్నారనేది, పోలీసులు వారిని పట్టుకునేందుకు చేసే ప్రయత్నాలు హై వోల్టేజ్ థ్రిల్‌ను అందిస్తాయి. థామస్ దంపతులు, హాస్పిటల్‌లోని డాక్టర్‌తో పాటు, మరికొంతమంది పాత్రల చుట్టూ కథ అల్లుకున్న విధానం సినిమాకు ప్రధాన బలంగా మారింది.
ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేనే ప్రాణం అని చెప్పాలి. మొదటి సన్నివేశం నుంచి క్లైమాక్స్ వరకూ ప్రేక్షకులను ఎక్కడా బోర్ కాకుండా ఉంచగలిగారు. కథ అంచెలంచెలుగా ఆసక్తిని పెంచుతూ సాగుతుంది. కుంచాకో బోబన్ తన పాత్రలో ఒదిగిపోయి పాత్రకు న్యాయం చేశాడు. సినిమా చూసేటప్పుడు ఆయన పోలీస్ ఆఫీసర్ పాత్రను అద్భుతంగా జీవించినట్లు అనిపిస్తుంది.రొబీ వర్గీస్ రాజ్ అందించిన సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ థ్రిల్ కనిపించేలా చిత్రీకరించారు.
జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం సినిమా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది.ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ క్లైమాక్స్ సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. చమన్ చాకో ఎడిటింగ్ కూడా ఎంతో కచ్చితంగా ఉంది.కొన్ని సందర్భాల్లో ఒక చిన్న కేసు దర్యాప్తు చేస్తూ వెళితే, అది మరింత పెద్ద నేరస్థుల ఆనవాళ్లను బయటపెడుతుంది. అదే విధంగా ఈ సినిమాలోనూ అనుకున్నదానికంటే పెద్ద మిస్టరీ బయటపడుతుంది. కథ స్క్రీన్‌ప్లే, నటన, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ – అన్నీ కలిపి మంచి థ్రిల్లర్‌ను అందించాయి. థ్రిల్లింగ్ కథలను ఇష్టపడేవారు తప్పకుండా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం ‘నెట్‌ఫ్లిక్స్’లో అందుబాటులో ఉన్న ఈ చిత్రాన్ని తప్పక చూడమని సూచిస్తున్నాం!