ప్రముఖ టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన జీవిత భాగస్వామి ప్రణతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ప్రణతికి ప్రత్యేకంగా విషెస్ చెబుతూ, “అమ్మలు హ్యాపీ బర్త్‌డే” అని పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా తన భార్యతో కలిసిన రెండు ఫోటోల్ని షేర్ చేశారు. ప్రస్తుతం ఈ జంట జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే.
ఎన్టీఆర్ జపాన్‌లో సందడి
తారక్ నటించిన సినిమా ‘దేవర’ మార్చి 28న జపాన్‌లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల కోసం ఎన్టీఆర్ తన సతీమణి ప్రణతితో కలిసి జపాన్ వెళ్లారు. గత కొన్ని రోజులుగా అక్కడి అభిమానులతో కలిసి ఎన్టీఆర్ సందడి చేస్తున్నారు. అభిమానులు అతనికి ఘన స్వాగతం పలుకుతుండగా, సినిమాపై అక్కడి ప్రేక్షకుల ఆశక్తి మరింత పెరుగుతోంది.
పుట్టినరోజు వేడుకలు
జపాన్‌లో ఉన్నప్పటికీ, తన భార్య పుట్టినరోజును మరింత ప్రత్యేకంగా జరిపేందుకు ఎన్టీఆర్ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి వేడుకలు జరుపుకోగా, వాటికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు కూడా తారక్ భార్య ప్రణతికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఎన్టీఆర్ ప్రాజెక్టులు
జపాన్ నుంచి తిరిగిన వెంటనే ఎన్టీఆర్ తన తదుపరి ప్రాజెక్ట్ ‘ఎన్టీఆర్ 31’ షూటింగ్‌లో పాల్గొననున్నారు. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించే ఈ సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది.అంతేకాక, బాలీవుడ్‌లో కూడా ఎన్టీఆర్ అరంగేట్రం చేయనున్న ‘వార్ 2’ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారని సినీ వర్గాలు వెల్లడించాయి.
సోషల్ మీడియా
జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఈసారి తన భార్య ప్రణతికి చేసిన బర్త్‌డే విషెస్ పోస్టు కేవలం కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారిపోయింది. అభిమానులు ఈ జంటను చూసి మురిసిపోతున్నారు.ఎన్టీఆర్ మరిన్ని సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘దేవర’, ‘ఎన్టీఆర్ 31’, ‘వార్ 2’ చిత్రాలతో భారీ స్థాయిలో సందడి చేయనున్నాడు.