CBN davos

ప్రపంచంలో ఇప్పుడు భారత్ అన్స్టాపబుల్ – చంద్రబాబు

దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారత్ అభివృద్ధిని ప్రశంసించారు. గతంతో పోలిస్తే ఇప్పుడు భారత్ గ్లోబల్ మర్చంట్‌గా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. “1997 నుంచి దావోస్‌కి హాజరౌతున్నాను. అప్పట్లో భారత్‌కు అంతగా గుర్తింపు ఉండేది కాదు. కానీ ఇప్పుడు ప్రపంచం భారత్ వైపుగా చూస్తోంది. 2028 నాటికి భారత్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు ప్రపంచంలో భారత్ “అన్స్టాపబుల్ ” అని చంద్రబాబు చెప్పారు.

అలాగే ఇక్కడ వేర్వేరు రాజకీయ పార్టీల ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ, దేశం అభివృద్ధి కోసం ఐక్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. కలిసి పనిచేస్తే మాత్రమే వికసిత భారత్ సాధ్యమవుతుంది అని తెలిపారు. వ్యవసాయం, మానవాభివృద్ధి రంగాలలో డీప్ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఇండియా బ్రాండ్ ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందుతోంది. ఈ అభివృద్ధి ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాల్సి ఉంది” అని ఆయన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో 165 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో సుస్థిర అభివృద్ధికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగని చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణ, వృద్ధిరేటులో మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరముందని, ఆ దిశగా కృషి చేస్తామని ఆయన తెలిపారు.

దావోస్‌లో తొలిసారి భారత్ తరఫున అన్ని రాష్ట్రాల నాయకులు కలిసి ఒకే వేదికపై చర్చలు జరిపారని చంద్రబాబు వివరించారు. “ఇది భారత అభివృద్ధి దిశలో ఒక పెద్ద ముందడుగు. అన్ని పార్టీల నేతలతో కలిసి పనిచేయడం వల్ల దేశం త్వరితగతిన అభివృద్ధి చెందుతుంది. ఈ సదస్సు ద్వారా భారత్‌కి మరింత గౌరవం పెరిగింది” అని అన్నారు.

చంద్రబాబుతో పాటు దావోస్‌ సదస్సులో పాల్గొన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా భారత్ అభివృద్ధి పట్ల తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే ప్రతి రాష్ట్రం తనవంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, దావోస్ వేదిక ద్వారా ఈ సందేశం ప్రపంచానికి వెళ్లిందని నాయకులు అభిప్రాయపడ్డారు.

Related Posts
Janasena : కాసేపట్లో “జయకేతనం” సభ
"Jayaketanam" meeting soon

Janasena : జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, Read more

Donald Trump: రేపు పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడనున్న ట్రంప్?
రేపు పుతిన్‌తో ఫోన్ లో మాట్లాడనున్న ట్రంప్?

ఉక్రెయిన్ యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఆయ‌న ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌తో మాట్లాడే Read more

పానీపూరి విక్రేతకు జీఎస్టీ నోటీసు
పానీపూరి విక్రేతకు జీఎస్టీ నోటీసు

తమిళనాడులో ఒక పానిపూరి విక్రేత తన ఆన్లైన్ చెల్లింపులు ఒక సంవత్సరంలో 40 లక్షల రూపాయలను దాటిన తర్వాత జీఎస్టీ నోటీసు అందుకున్నాడు. ఈ పానీపూరి విక్రేతకు Read more

భ‌విష్య‌త్తులో జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డమ‌నేది ప‌గ‌టి క‌లే: యనమల
yanamala rama krishnudu comments on ys jagan

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణ మరోసారి మాజీ ముఖ్యమంత్రి మరియు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై విమర్శులు గుప్పించారు. Read more