Notices to Patnam Narender Reddy once again!

పట్నం నరేందర్ రెడ్డికి మరోసారి నోటీసులు !

హైదరాబాద్‌: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రోటిబండ తాండ ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి షరతులకు కూడిన బెయిల్‌ను హైకోర్టు ఇచ్చింది. అయితే బెయిల్ పై ఉండి షరతులను ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్ పెట్టారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఎల్లుండి విచారణకు హాజరుకావాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. కాగా, కొడంగల్‌ రైతులపై దాడి చేసిన కుట్రలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇటీవలే అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

కాగా, నవంబర్‌ 11న కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు సేకరించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై దాడి చేశారంటూ 24 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు కుట్ర చేశారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్, సురేశ్ అనే మరో వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. రైతులు, ఎమ్మెల్యేను చర్లపల్లి, సంగారెడ్డి జైళ్లకు తరలించారు. దీనిపై తెలంగాణ హైకోర్టును మాజీ ఎమ్మెల్యే ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం 24 మంది రైతులతోపాటు పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 19న ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.

Related Posts
ఢిల్లీ సీఎం ఎన్నిక – అబ్జర్వర్లను నియమించిన బిజెపి
bjp 1019x573

ఢిల్లీ రాజకీయ సమీకరణాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఈరోజు సాయంత్రం 7 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎన్నికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రధానమంత్రి Read more

తన విజయం సందర్భంగా మెలానియాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపిన ట్రంప్
melania

రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బుధవారం తన విజయం ప్రసంగంలో అతని భార్య అయిన మెలానియాకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ప్రసంగం మధ్యలో,ట్రంప్ Read more

Tamil Nadu Chief Annamalai : విజయ్‌పై అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు
Tamil Nadu Chief Annamalai విజయ్‌పై అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు

Tamil Nadu Chief Annamalai : విజయ్‌పై అన్నామలై తీవ్ర స్థాయిలో విమర్శలు ఇదిగో, నూతన రాజకీయ నాయకుడు విజయ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఘాటైన Read more

మహిళల భద్రతపై దృష్టి సారించండి : జగన్
Focus on women's safety: YS Jagan

పీలేరు యాసిడ్ దాడిని ఖండించిన వైఎస్ జగన్‌ అమరావతి : అన్నమయ్య జిల్లా పీలేరులో యువతిపై జరిగిన యాసిడ్ దాడి ఘటనపై మాజీ సీఎం జగన్ ఖండించారు. Read more