Notices to Patnam Narender Reddy once again!

పట్నం నరేందర్ రెడ్డికి మరోసారి నోటీసులు !

హైదరాబాద్‌: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రోటిబండ తాండ ఘటనలో పట్నం నరేందర్ రెడ్డికి షరతులకు కూడిన బెయిల్‌ను హైకోర్టు ఇచ్చింది. అయితే బెయిల్ పై ఉండి షరతులను ఉల్లంఘిస్తూ ప్రెస్ మీట్ పెట్టారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు.

ఎల్లుండి విచారణకు హాజరుకావాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి బొంరాస్‌పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీంతో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. కాగా, కొడంగల్‌ రైతులపై దాడి చేసిన కుట్రలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇటీవలే అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

కాగా, నవంబర్‌ 11న కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అల్లర్లు జరిగిన సంగతి తెలిసిందే. ఫార్మా కంపెనీ ఏర్పాటు కోసం భూములు సేకరించేందుకు వెళ్లిన కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులపై దాడి చేశారంటూ 24 మంది రైతులను పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు కుట్ర చేశారంటూ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్, సురేశ్ అనే మరో వ్యక్తిని సైతం అరెస్టు చేశారు. రైతులు, ఎమ్మెల్యేను చర్లపల్లి, సంగారెడ్డి జైళ్లకు తరలించారు. దీనిపై తెలంగాణ హైకోర్టును మాజీ ఎమ్మెల్యే ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం 24 మంది రైతులతోపాటు పట్నం నరేందర్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 19న ఆయన బెయిల్‌పై బయటకు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *