Notices to former MP Harsha Kumar.

Harsha Kumar: మాజీ ఎంపీ హర్ష కుమార్ కు నోటీసులు..!

Harsha Kumar: మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ కు ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై హర్ష కుమార్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్వచ్ఛ దారాలు ఉంటే తీసుకొని దర్యాప్తుకు రావాలని రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పి నోటీసులో స్పష్టం చేశారు.

Advertisements
మాజీ ఎంపీ హర్ష కుమార్

అండర్ సెక్షన్ 194 బీఎన్ఎస్ఎస్ చట్టం కింద పోలీసులు కేసు

రాజానగరం పోలీస్ స్టేషన్ నుంచి క్రైమ్ నెంబర్ 136/2025 పేరుతో నోటీసులు పంపగా.. అండర్ సెక్షన్ 194 బీఎన్ఎస్ఎస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై హర్షకుమార్ మీ వద్ద ఏమైనా సమాచారం ఇవ్వమని గతంలో ఒకసారి అడిగాం. మరోసారి అడుగుతున్నాం. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే సీసీ ఫొటోస్ కానీ.. సీసీ ఫుటేజీ వీడియోలు.. ఇంకెమైనా ఆధారాలు ఉంటే రేపు సాయంత్రం 5 గంటలకు రాజానగరం పోలీస్ స్టేషన్ కు రావాలి అని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయకూడదని.. కోరడం జరిగింది.

నేనే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రశ్నలు

రాజనగరం పోలీసులు ఇచ్చిన నోటీసులకు హర్ష కుమార్ స్పందించారు. మీరు నాకు నోటీసులు ఇవ్వడం కాదు. నేనే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు నాకు సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది అని హర్ష కుమార్ పోలీసులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా గత నాలుగు రోజుల కిందట పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే సమయంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇక ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Related Posts
Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది
అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు బిగ్ గిఫ్ట్ వచ్చేసింది. ఆయన పుట్టినరోజు సందర్భంగా, బన్నీ నటించనున్న కొత్త సినిమా 'AA22'కు సంబంధించి అఫీషియల్ ప్రకటన విడుదలైంది. Read more

భారతీయులకు జో బైడెన్ శుభవార్త
visa

ట్రంప్ ఎన్నికలో గెలిచి, జనవరిలో కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్న తరుణంలో వీసాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆందోనళ చెందే వారికీ జో బైడెన్ Read more

యాదవ కార్పొరేషన్ చైర్మన్ కుమారుడి పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu attend

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు తిరుపతి లోక్ సభ స్థానం టీడీపీ ఇన్‌చార్జి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కుమారుడి వివాహ వేడుకకు హాజరయ్యారు. Read more

తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే రాహుల్ గాంధీ రావాలి : కేటీఆర్
Rahul Gandhi should come only to apologize to the people of Telangana

హైదరాబాద్‌ : నేడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బహిరంగ లేఖ విడుదల చేశారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×