మరోసారి కాకాణి గోవర్దన్ రెడ్డికి నోటీసులు

Kakani Govardhan Reddy: మరోసారి కాకాణి గోవర్దన్ రెడ్డికి నోటీసులు!

Kakani Govardhan Reddy: మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డి పరారీలో ఉన్నారు. ఆయన ఆచూకీ కోసం హైదరాబాద్‌లో నెల్లూరు పోలీసులు వెతుకుతున్నారు. నగరంలోని ఆయన 3 ఇళ్ల వద్దకు పోలీసులు వెళ్లారు. ఇంట్లో ఆయన లేకపోవడంతో బంధువులకు నోటీసులు ఇచ్చారు. ఏప్రిల్‌ 1న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.

Advertisements
మరోసారి కాకాణి గోవర్దన్ రెడ్డికి నోటీసులు

ఏప్రిల్‌ 1న హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు

అక్రమ మైనింగ్‌, రవాణాకు పాల్పడ్డారంటూ పొదలకూరు పీఎస్‌లో ఆయనపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలు వినియోగించారని ఆరోపణలున్నాయి. ఈ కేసులో సోమవారం విచారణకు ఆయన రాకపోవడంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. ఏప్రిల్‌ 1న హాజరు కాకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఆదివారం నెల్లూరులోని ఇళ్లలోనూ కాకాణి ఆచూకీ లభించలేదు. దీంతో అక్కడి ఇంటి గోడకు నోటీసులు అంటించారు.

నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణ

కాగా, ఈ కేసులో కాకాణిని విచారించేందుకు నెల్లూరు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయనకు నోటీసులు ఇస్తున్నారు. నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ ఎవరూ లేకపోవడం, వాళ్ల ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

Related Posts
బీజేపీలో చేరిన కాంగ్రెస్ నేత‌లు
NKV BJP

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిమాణం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల వేళ మాజీ ఎంపీ సీతారాం నాయక్, బీజేపీ Read more

బాలకృష్ణ ను ఎప్పుడు అలాగే పిలవాలనిపిస్తుంది – పవన్
Pawan announced a donation

విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహించిన మ్యూజికల్ నైట్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ, సీఎం చంద్రబాబు, నారా లోకేష్ Read more

Nara Lokesh:తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు లోకేశ్ సీరియస్ వార్నింగ్
Nara Lokesh:తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు లోకేశ్ సీరియస్ వార్నింగ్

ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపురంలో రిలయన్స్ సంస్థ ఆధ్వర్యాన ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంటుకు మంత్రి లోకేశ్ బుధ‌వారం భూమిపూజ చేశారు.ఈ Read more

Amaravati : అమరావతిలో కొత్తగా 17 హోటళ్లు ఏర్పాటు
17 new hotels to be established in Amaravati

Amaravati : ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సహకారంతో అమరావతిలో కొత్తగా 17 హోటళ్లు రానున్నాయి. విదేశాలకు వెళ్లిన తెలుగు వారెందరో వెనక్కి వచ్చి అమరావతిలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×