కెనడా నుంచి బాలీవుడ్ వరకు – నోరా ఫతేహి ప్రేరణాత్మక ప్రయాణం
సినీ పరిశ్రమలో స్థిరమైన గుర్తింపు సంపాదించడం ఎంతటి కష్టమైన పని అనేది నోరా ఫతేహి జీవితం చెబుతుంది. టొరంటో, కెనడాలో జన్మించి పెరిగిన నోరా, బాలీవుడ్ వైపు మొగ్గినప్పుడు ఆమె వద్ద ఉన్న మొత్తం డబ్బు కేవలం రూ.5,000 మాత్రమే. కానీ అప్పుడు ఆమెకి ఉన్న తాపత్రయం, నటిగా ఎదగాలనే సంకల్పం ఆమెను ఇండియాకు తీసుకొచ్చింది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమె ఎన్నో అవమానాలు, కష్టాలు, మోసాలు ఎదుర్కొన్నప్పటికీ, వెనక్కి తగ్గలేదు. ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొని, చిన్న చిన్న అవకాశాలను పెద్ద అవకాశాలుగా మార్చుకుంది.
ఇండియాకు వచ్చాక మొదట్లో ఆమె జీవితం అతి దారుణంగా సాగింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన విషయాల ప్రకారం, తొమ్మిది మంది మానసిక రోగులతో కలసి మూడు బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో జీవించింది. జీవనానికి తగినంత డబ్బు లేక, గుడ్డు, బ్రెడ్, పాలు తాగుతూ కాలం వెళ్లదీసింది. ఒక ఏజెన్సీ చేతిలో మోసపోయి, తన పారితోషికం నుంచి అద్దె, కమిషన్ పేరుతో డబ్బులు కట్ చేసి ఇచ్చిన విషయాలు ఆమె చెబుతుంటే, అప్పటి బాధలు స్పష్టంగా కనిపిస్తాయి. అయినా ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. తన లక్ష్యాన్ని మరిచిపోలేదు.
ఒక స్పెషల్ సాంగ్ టర్నింగ్ పాయింట్ – ‘దిల్ బర్’
నోరా కెరీర్‌లో అసలైన మలుపు ‘దిల్ బర్’ సాంగ్‌తో వచ్చింది. 2018లో విడుదలైన ఈ పాట ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. శత్రు మూవీలో ఈ పాట పాపులర్ కావడం వల్ల ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అంతేకాదు, ఈ పాట యూట్యూబ్‌లో బిలియన్ల వ్యూస్ సాధించడమే కాకుండా, ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు కూడా తెచ్చింది. ఆ తర్వాత ఆమెకు వరుస అవకాశాలు వచ్చాయి – స్పెషల్ నెంబర్లు, బ్రాండ్ ప్రమోషన్లు, స్టేజి షోలు ఇలా విస్తృతంగా పేరుపొందింది.
ఆమె నటించిన టెంపర్, బాహుబలి: ది బిగినింగ్, కిక్ 2 వంటి తెలుగు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా సౌత్ ప్రేక్షకులకు కూడా చేరువైంది. ఈ పాటల ద్వారా ఆమె డాన్సింగ్ స్కిల్స్‌కి మంచి పేరు తెచ్చుకుంది. నేడు ఆమె ఒక సాంగ్‌కు రూ.2 నుంచి రూ.3 కోట్లు వసూలు చేస్తూ ఇండస్ట్రీలో హై పెయిడ్ ఐటెం డ్యాన్సర్లలో ఒకరిగా నిలిచింది.
ఒక్క అవకాశం చాలు.. ఆత్మవిశ్వాసమే ఆయుధం!
నోరా ఫతేహి మనకు చెప్పే పెద్ద సందేశం – స్థిరంగా ముందుకెళ్లాలంటే ఆత్మవిశ్వాసం కావాలి. అవకాశాలు స్వయంగా రావు, వాటిని వెతకాలి. దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకుని నిరూపించుకుంటే, ప్రపంచమే మన వెంట వస్తుంది. ఆమె జీవితంలో ఎదురైన అనేక సవాళ్ళు, అవమానాలు, మోసాల మధ్య కూడా నిలబడిన విధానం, యువతకు గొప్ప స్ఫూర్తి.
ప్రస్తుతం నోరా ఫతేహి బ్రాండ్ ఎంబాసిడర్‌గా, పలు టీవీ షోల జడ్జ్‌గా, ఫ్యాషన్ ఐకాన్‌గా ఎదుగుతోంది. బీ హ్యాపీ అనే అభిషేక్ బచ్చన్ చిత్రంలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ఆమె ఆస్తులు రూ.52 కోట్లు దాటినట్టు సమాచారం. ఒక బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌కు కనీసం రూ.5 లక్షలు వసూలు చేస్తుంది.
సినీప్రియులకే కాదు – స్ఫూర్తి కావలసిన ప్రతీ ఒక్కరికీ ఆదర్శం నోరా ఫతేహి
నోరా కథ కేవలం గ్లామర్ ప్రపంచానికి పరిమితం కాదు. ఇది ప్రతి పోరాటశీల యువతికి, ప్రతి కల కలవాలనుకునే మనిషికీ అవసరమైన ఉదాహరణ. జీవితం ఎంత క్లిష్టంగా ఉన్నా, ధైర్యం, పట్టుదల ఉంటే ఎలా విజయం సాధించవచ్చో నోరా ఫతేహి చూపించింది.
read also: Sharwanand : శర్వానంద్ కొత్త సినిమాకు పవర్‌ఫుల్ టైటిల్