Non stop bomb threats to Delhi schools

ఢిల్లీ స్కూళ్లకు ఆగని బాంబు బెదిరింపులు..

న్యూఢిల్లీ: ఢిల్లీలో పాఠశాలలకు బాంబు బెదిరింపులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం ఉదయం ఈస్ట్‌ ఢిల్లీ, నోయిడాలోని పలు స్కూళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈ-మెయిల్‌ ద్వారా వార్నింగ్‌ రావడంతో ముందుజాగ్రత్తగా స్కూళ్లను మూసివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్‌ సిబ్బంది స్కూళ్లలో తనిఖీలు చేశారు. అనంతరం అనుమానాస్పద వస్తువులేవీ లేవని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. మయూర్‌ విహార్‌లోని అహ్లాకాన్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు బెదిరింపు మెయిల్‌ వచ్చినట్లు ప్రిన్సిపల్‌ పాండవ్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌కు టెలిఫోన్‌ ద్వారా తెలియజేశారని వెల్లడించారు.

image

అంతేకాక.. నోయిదాలోని శివ్‌ నాడార్‌ స్కూల్‌కు బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. బాంబ్‌ స్క్వాడ్‌, ఫైర్‌ సిబ్బంది, డాగ్‌ స్క్వాడ్‌ స్కూల్‌లో తనిఖీలు చేస్తున్నారని వెల్లడించారు. మెయిల్‌ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయమై సైబర్‌ టీమ్‌ దర్యాప్తు చేస్తున్నదని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి గాలివార్తలను నమ్మొద్దని నోయిడా పోలీసులు సూచించారు.

ఇకపోతే..ఢిల్లీలోని స్కూళ్లకు గతకొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు రావడం నిత్యకృత్యంగా మారిన విషయం తెలిసిందే. గత నెల 10న స్కూళ్లకు బెదింపుల వెనక ఉన్న దొంగను పోలీసులు పట్టుకున్నారు. ఓ మైన‌ర్ విద్యార్థి.. త‌న స్కూల్ ప‌రీక్ష‌ల‌ను త‌ప్పించుకునేందుకు ఆ బెదిరింపులు చేసిన‌ట్లు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న ఓ విద్యార్థిని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు.

Related Posts
Pathorol™..రొయ్యల పెంపకంలో E.H.P వ్యాధి నియంత్రణా ప్రాముఖ్యతను పరిష్కారాలను వివరించిన కెమిన్ సంస్థ
Chemin Company explains the importance of E.H.P disease control solutions in shrimp farming by introducing the scientifically proven Pathorol™

ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రొయ్యల పెంపకంలో 73% కంటే ఎక్కువ వాటాను కలిగి ఉంది. రొయ్యల పెంపకంలో అత్యధిక నష్టాలు కలిగిస్తున్న E.H.P ఒక పరాన్నజీవి. మనదేశంలో రొయ్యలసాగు Read more

ఢిల్లీ బొమ్మలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే
ఢిల్లీ బొమ్మలపై .డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే

దేశ రాజధాని ఢిల్లీ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటం ప్రత్యేకంగా ప్రదర్శింపబడింది. ఈ శకటంలో ఏటికొప్పాక బొమ్మలు ఉన్న విషయం డిప్యూటీ సీఎం Read more

Donald Trump: ట్రంప్ కు కెనడా కొత్త ప్రధాని తీవ్ర హెచ్చరిక
ట్రంప్ కు కెనడా కొత్త ప్రధాని తీవ్ర హెచ్చరిక

కెనడా నూతన ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మార్క్ కార్నీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సీరియస్ కౌంటర్ ఇచ్చారు. కెనడాని అమెకాలో విలీనం చేసుకుంటామని ట్రంప్ Read more

Bill Gates: భారత పర్యటనకు రానున్న బిల్ గేట్స్
Bill Gates: భారత పర్యటనకు రానున్న బిల్ గేట్స్

బిల్ గేట్స్ మరోసారి భారత పర్యటనకు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ త్వరలో భారత పర్యటనకు రానున్నారు. మూడేళ్లలో ఇది ఆయన మూడో భారత పర్యటన Read more