తిరువనంతపురం : యోగా గురు బాబా రాందేవ్‌కు కేరళలో కోర్టు ఒకటి నాన్‌బెయిలబుల్ వారెంటు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలన్న ఆదేశాలను విస్మరించినందుకు పాలక్కాడ్‌లోని జ్యడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేటు కోర్టు-2 ఈ వారెంటు ఇచ్చింది. ఔషధాలకు సంబంధించి పతంజలి సంస్థకు అనుబంధంగా ఉన్న దివ్వ ఫార్మసీ తప్పుదోవపట్టించేలా ప్రకటనలు ఇచ్చిందంటూ ఆ సంస్థ నిర్వాహకులైన రాందేవ్‌తో పాటు, ఆచార్య బాలకృష్ణలపై కేరళ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ కేసు పెట్టారు. ఫిబ్రవరి ఒకటో తేదీన విచారణకు హాజరు కావాలంటూ గతంలో కోర్టు నోటీసులు ఇవ్వగా వారు దాన్ని అమలు చేయలేదు. దీంతో వారిని ఈ నెల 15న కోర్టులో ప్రవేశపెట్టాలంటూ వారెంట్లు జారీ చేసింది.
కాగా, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన దివ్య ఫార్మసీ కేళర యాడ్స్ రూల్స్ బ్రేక్ చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేశారు. దీనిపై ఫిబ్రవరి 01న కోర్టు ఎదుట హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా బాబా రామ్‌దేవ్, బాలకృష్ణలను న్యాయస్థానం ఆదేశించింది. వీరు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఇద్దరిపై నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు. ఈ కేసులో తదుపరి విచారణ ఫిబ్రవరి 15న జరగనుంది. దివ్య ఫార్మాసిటీని మొదటి నిందితుడిగా, ఆచార్య బాలకృష్ణ రెండో నిందితుడిగా, బాబా రామ్‌దేవ్‌ను మూడో నిందితుడిగా పేర్కొన్నారు.

గతంలో కూడా అల్లోపతి వంటి ఆధునిక ఔషధాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రచారం చేసినందుకుగానూ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అటువంటి ప్రకటనలు మానుకోవాలని హెచ్చరించింది. అవేమి పట్టించుకోని పతంజలి సంస్థ.. తిరిగి ప్రకటనలు ప్రచురించడంతో కోర్టు ధిక్కార నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారం సీరియస్ కావడంతో రామ్‌దేవ్, ఆచార్య బాలకృష్ణలు బహిరంగ క్షమాపణలు చెప్పారు.