న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్‌ను చదవి వినిపిస్తున్నారు. మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు నిర్మలా సీతారామన్. రూ.12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు వెల్లడించారు. రూ.12 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రూపంలో రూ.80 వేలు ఆదా అవుతుంది. ఇతర పన్ను శ్లాబ్స్‌లో కూడా మార్పులు చేయనున్నారు. దీంతో మధ్య తరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ దక్కింది.

బీహార్ లోని పాట్నా ఐఐటీ విస్తరణకు నిర్ణయం తీసుకున్నారు. విద్యారంగంలో AI వినియోగించనున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులు తీసుకురానున్నారు. ప్రభుత్వ స్కూళ్లకు బ్రాండ్ బ్యాండ్ ఇంటర్నెట్ సేవలు అందించనున్నట్లు ప్రకటించారు. సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. 50 ఏళ్ల వరకూ వడ్డీ రహిత రుణాలు ఇవ్వనున్నారు.
ప్రభుత్వ పాఠశాలకు డిజిటల్ స్కూళ్లుగా తీర్చిదిద్దేంకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ స్కూళ్లకు బ్రాడ్ బ్యాండ్ సేవలు అందిస్తామని వెల్లడించారు. భారతీయ భాషల పుస్తకాలకు డిజిటల్ రూపం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ స్కూళ్లలో 50 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంగన్ వాడీ కేంద్రాలకు కొత్త హంగులు అద్దుతామన్నారు.