हिन्दी | Epaper
అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Nallamala Forest : నల్లమల అటవీ ప్రాంతంలోకి ఎవ్వరు వెళ్లొద్దు – అటవీ అధికారులు

Sudheer
Nallamala Forest : నల్లమల అటవీ ప్రాంతంలోకి ఎవ్వరు వెళ్లొద్దు – అటవీ అధికారులు

ఉమ్మడి ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని పలు ప్రాంతాల్లో గత మూడు నెలలుగా పెద్దపులి సంచరిస్తుండడంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. అడవికి సమీపంగా ఉన్న గ్రామాల్లో పశువులను పెద్దపులి కొట్టేస్తుండటంతో పశువుల కాపరులు రాత్రివేళ బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారుల చర్యలు మొదలయ్యాయి.

ప్రజలు రాత్రివేళల్లో అటవీ ప్రాంతాలవైపు ఒంటరిగా వెళ్లకూడదు

మార్కాపురం డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ ప్రసాద్ రెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ, నల్లమల అటవీ ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న గ్రామాల ప్రజలు రాత్రివేళల్లో అటవీ ప్రాంతాలవైపు ఒంటరిగా వెళ్లకూడదని సూచించారు. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అప్రమత్తంగా ఉండాలని, పశువులను ఒంటరిగా అడవిలో వదలవద్దని హెచ్చరించారు. ప్రజల రక్షణ కోసం ఫారెస్ట్ సిబ్బంది సంబంధిత ప్రాంతాల్లో గస్తీ బలగాలు మోహరించినట్లు తెలిపారు.

పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతాలు గుర్తింపు

పెద్దపులి సంచరిస్తున్న ప్రాంతాల్లో పాదముద్రలను సేకరించి, తిరుగుతున్న దిశ, ప్రవర్తనపై అధ్యయనం చేస్తుండటాన్ని ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. పులిని బంధించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టామని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. అటవీ శాఖ సూచనలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని, గ్రామస్థులు సమన్వయంతో సహకరించాలని కోరారు.

Read Also : US : అక్రమ వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త పథకం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870