Nitish Kumar Reddy received

నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం

టీమ్ ఇండియా యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి వైజాగ్ ఎయిర్పోర్టులో అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన ముగించుకొని స్వస్థలానికి చేరుకున్న ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు గుమిగూడి ఘనంగా సన్మానించారు. పూలదండలు వేసి, పూలు చల్లుతూ నినాదాలు చేశారు. అభిమానులు ఎయిర్పోర్టులోనే ఆయనను చూసేందుకు భారీగా తరలి వచ్చారు. నితీశ్ వారందరితో కరచాలనం చేసి, తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీప్‌లో ఊరేగింపుగా తన ఇంటికి చేరుకున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో నితీశ్ చెలరేగిన ఆటతీరుకు అభిమానులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా కీలక మ్యాచుల్లో నితీశ్ ప్రదర్శన టీమ్ ఇండియాకు విజయాలను అందించింది.

ఈ నేపధ్యంలో ఆయన స్వదేశానికి చేరుకోవడం తో అభిమానుల హర్షం వ్యక్తం చేసారు. అభిమానుల అండతో మరింత ఆత్మవిశ్వాసం పొందిన నితీశ్, రాబోయే టోర్నమెంట్లలో కూడా తన ప్రతిభను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నారు. “మీ అందరి ప్రేమకు కృతజ్ఞతలు. నా పైన మీరు చూపిస్తున్న విశ్వాసాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తాను” అని ఆయన వ్యాఖ్యానించారు. వైజాగ్‌లో నితీశ్‌కు జరిగిన ఈ వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రీడా అభిమానులు మరియు నెటిజన్లు నితీశ్ భవిష్యత్తు విజయాలపై ఆశలు వ్యక్తం చేస్తున్నారు.

Related Posts
Cabinet Expansion : మంత్రి వర్గ విస్తరణకు ఓకే!
Telangana Cabinet M9

తెలంగాణలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర క్యాబినెట్ విస్తరణకు కాంగ్రెస్ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ Read more

ఆర్జీకర్‌ ఆసుపత్రిలో వైద్యురాలి విగ్రహం.. సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
statue of a doctor in Rg Kar hospital. There are different opinions on social media

statue of a doctor in Rg Kar hospital.. There are different opinions on social media కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా Read more

హరిహర వీరమల్లు షూటింగ్ లో పాల్గొన్న పవన్
pawan HARIHARA

సినీ నటుడు , జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం పవన్ హరిహర వీరమల్లు Read more

ఆర్జీ కార్ కేసులో సంజయ్ రాయ్ కోర్టులో ఏం చెప్పాడు?
ఆర్జీ కార్ కేసులో సంజయ్ రాయ్ కోర్టులో ఏం చెప్పాడు?

కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం, హత్య కేసులో మాజీ సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను దోషిగా నిర్ధారించారు. తనను Read more