Yogi Adityanath: బీహార్ ఎన్నికల ప్రచారంలో ఎన్డీయే మరియు ఇండియా కూటమి నేతల మధ్య మాటల యుద్ధం మరింత వేడెక్కింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బీహార్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh yadav) లను తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, “తేజస్వీ అంటే అప్పు, రాహుల్ అంటే పప్పు, అఖిలేశ్ అంటే తప్పు” అంటూ ఎద్దేవా చేశారు. గాంధీజీ చెప్పిన మూడు కోతులను ఉటంకిస్తూ, “ఇప్పుడు బీహార్‌లో మూడు కోతులు ఉన్నారు అప్పు, పప్పు, తప్పు వీరు ప్రజలను మభ్యపెట్టి మళ్లీ జంగిల్ రాజ్‌ను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు” అన్నారు.

Yogi Adityanath
Read also: Users: రీఛార్జ్ లు తగ్గించాలని AIRTEL, JIO లకు నెటిజన్లు విజ్ఞప్తి
Yogi Adityanath: ఈ వ్యాఖ్యలపై అఖిలేశ్ యాదవ్ గట్టిగా స్పందించారు. బీజేపీ ఎప్పుడూ ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు ఇలాంటి వ్యంగ్యాలను ఉపయోగిస్తుందని విమర్శించారు. “గాంధీజీ చెప్పిన కోతులను వీరు తరచూ గుర్తుచేసుకుంటున్నారు, కానీ ఆ సందేశాన్ని పాటించడం లేదు” అన్నారు. అంతేకాకుండా, “నిజానికి ఆయన (యోగి ఆదిత్యనాథ్)ను కోతుల మధ్య కూర్చోబెడితే ఎవరికీ గుర్తుపట్టలేము” అంటూ అఖిలేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మాటల యుద్ధం బీహార్ ఎన్నికల వేళ రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also