కరూర్ ఘటన తర్వాత విజయ్ కీలక నిర్ణయాలు
తమిళనాడులోని కరూర్‌లో జరిగిన ఘోర తొక్కిసలాట(Karur incident) ఘటన విజయ్‌ను(Vijay) తీవ్రంగా కలచివేసింది. తన పార్టీ తమిళగ వెట్రి కళగం నిర్వహించిన ఆ ర్యాలీలో జరిగిన ఈ విషాదంలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, వంద మందికి పైగా గాయపడ్డారు. సుమారు 2,000 నుంచి 3,000 మందికి సరిపడే ప్రాంగణంలో దాదాపు 30,000 మంది అభిమానులు చేరడంతో పరిస్థితి అదుపు తప్పిందని అధికారులు వెల్లడించారు. విజయ్ వేదికపైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో గందరగోళం చెలరేగి, ఇది నిర్వాహక లోపం కారణంగానే జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.ఈ ఘటన(Karur incident) తర్వాత విజయ్ చేసుకుంటూ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, పార్టీని క్రమశిక్షణ, భద్రత, నిర్వహణ పరంగా పటిష్టం చేయడమే ఆయన లక్ష్యం.
Read also: YS Jagan: నేడు జిల్లా అధ్యక్షులతో జగన్ భేటీ

కొత్త నాయకత్వం, వాలంటీర్ ఫోర్స్ ఏర్పాటుకు శ్రీకారం
ఈ విషాదం నుంచి పాఠాలు నేర్చుకున్న విజయ్, డీఎంకే, అన్నాడీఎంకే తరహాలో తన పార్టీకి ప్రత్యేక స్వచ్ఛంద సేవకుల దళం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పార్టీ సమావేశాలు, సభలు, ప్రచార కార్యక్రమాల్లో జనాన్ని నియంత్రించడం, భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన ఇవ్వడం వంటి అంశాలపై ఈ బృందానికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. త్వరలోనే శిక్షణా శిబిరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఇక కరూర్ ఘటన తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ బుస్సీ ఆనంద్, ఎలక్షన్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ ఆదవ్ అర్జున్ వంటి కీలక నేతలు న్యాయపరమైన చిక్కుల కారణంగా పక్కకు తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ స్వయంగా పార్టీ నిర్మాణ బాధ్యతలు చేపట్టి, అనుభవజ్ఞులైన కొత్త నాయకులను గుర్తించి రెండో స్థాయి లీడర్‌షిప్‌ను తీర్చిదిద్దుతున్నారు.
కొత్తగా నియమితులయ్యే ఈ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. పార్టీ వర్గాల ప్రకారం, విజయ్ త్వరలోనే ఈ జాబితాను, వాలంటీర్ దళ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ చర్యల ద్వారా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, బాధ్యతాభావం పెంచి, టీవీకేను తమిళనాడులో ఒక శక్తివంతమైన రాజకీయ శక్తిగా మార్చడమే విజయ్ లక్ష్యం.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: