TG: నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం మాచినేనిపల్లిలో ఆదివారం జరిగిన భూమిపూజ కార్యక్రమం ఒక విలక్షణ ఉదాహరణగా నిలిచింది. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేయాల్సి రావడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) కార్యక్రమ స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడు రాములు భార్య గర్భవతిగా ఉండటంతో, స్థానిక నాయకులు, గ్రామస్థులు మంత్రినే పూజ చేయాలని కోరారు.
Read also: Aadhar Center : తెలంగాణలోని ప్రతి మండలంలో ఆధార్ కేంద్రం

Jupally started the construction of Indiramma’s house with his widow
వితంతువులపై ఇలాంటి వివక్ష చూపడం సమాజానికి చేటు
TG: అయితే మంత్రి జూపల్లి, ఈ కార్యక్రమాన్ని రాములు తల్లి లక్ష్మీదేవమ్మ చేతులు మీదుగా చేయించాలని సూచించారు. ఆమె వితంతువు కావడంతో కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేయడమే కాక, పూజకు అనర్హురాలని వ్యాఖ్యానించడంతో మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వితంతువులపై ఇలాంటి వివక్ష చూపడం సమాజానికి చేటు అని పేర్కొంటూ, లక్ష్మీదేవమ్మతోనే కొబ్బరికాయ కొట్టించి భూమిపూజను ప్రారంభించారు.
బాల్యవివాహాలు వంటి అనాగరిక ఆచారాలను
ఈ సందర్భంలో మాట్లాడుతూ, రెండు శతాబ్దాల క్రితమే సతీసహగమనం, బాల్యవివాహాలు వంటి అనాగరిక ఆచారాలను సంస్కర్తలు నిర్మూలించారని గుర్తుచేశారు. అప్పట్లోనే వితంతువుల పట్ల గౌరవం, వితంతు వివాహాలకు ప్రోత్సాహం ఇవ్వడం ప్రారంభించారని పేర్కొన్నారు. ఇంతవరకు కూడా కొంతమంది మూఢనమ్మకాలు పట్టుకొని, వితంతువులను శుభకార్యాలకు దూరం పెట్టడం మన సమాజంపై మచ్చగా మిగులుతుందని ఆవేదన తెలిపారు. ఇలాంటి సామాజిక దురాచారాలను దూరం చేయాల్సిన అవసరం ఎంతో ఉందని మంత్రి ప్రజలకు సందేశం ఇచ్చారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: