YSRC : విషప్రచారాలను చేయడంలో వైసీపీ విష వృక్షంగా తయారైందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్(Vasamsetty Subhash) ఎద్దేవ చేశారు. రాష్ట్రంలోని శెట్టి బలిజ సామాజికవర్గాన్ని ఓసిల్లో చేరుస్తున్నారంటూ వైసీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చీర్ల జగ్గిరెడ్డి చేస్తున్న దుష్ప్రచారాన్ని మంత్రి ఖండించారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగ్గిరెడ్డి అవగాహన రాహిత్యంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మంత్రి సుభాష్ మండిపడ్డారు. మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన జగ్గిరెడ్డి అవగాహన లోపం ఉందనేది ఆయన మాటల తీరుతో అర్థమవుతుందన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి కనీస అవగాహన లేకుండా మాట్లాడడం శోచనీయమన్నారు.

శెట్టి బలిజలపై వివాదం
శెట్టి బలిజల గురించి మాట్లాడే నైతిక అర్హత జగ్గిరెడ్డికి లేదని సుభాష్ స్పష్టంచేశారు. ఫోటోలతో ప్రచారం చేసుకోవడమనేది వైసీపీ నాయకులకు అలవాటు అని, తమకు వారిలా ఫోటోల పిచ్చిలేదని మంత్రి తెలియజేశారు. ఫోటోల పిచ్చితోనే 11 స్థానాలకే పరిమితమైన వారిలో జ్ఞానోదయం రావడం లేదని సుభాష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ ధోరణిని మార్చుకోకపోతే ఒకటికే పరిమితం కావలసి వస్తుందన్నారు.
బిసిల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉందన్నారు. ఈనెల 12న విజయవాడలో బిసి మంత్రులు, శాసనసభ్యులతో సమావేశం కూడా నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక సంస్థల్లో బిసిల రిజర్వేషన్లను 24శాతానికి తగ్గించిన వైసీపీ నేడు బిసీల పట్ల మొసలీ కన్నీరు కారుస్తుందన్నారు. బిసిలకు అగ్రతాంబూలం ఇచ్చిన పార్టీ తెలుగుదేశమని, బార్లు, వైన్ షాపుల్లో శెట్టి బలిజలకు అవకాశం కల్పించిన ఘనత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)కే దక్కుతుందని మంత్రి తెలిపారు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావడంతో వైసీపీ నాయకులకు దిమ్మతిరిగి అవాకులు చవాకులు మాట్లాడుతున్నారన్నారు.
యూరియా సరఫరాపై ఆరోపణలు
యూరియా(Urea) పై కూడా రైతుల్లో అనవసర భయాందోళనలు కల్పించి దుష్ప్రచారానికి వైసీపీ తెర తీసిందని మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఏటా సగటున 5 లక్షల టన్నుల యూరియా మాత్రమే రైతులకు అందించారని, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ ఖరీఫ్ సీజన్లో 7 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను అందుబాటులోకి తెచ్చామని ఆయన వివరించారు. ఇప్పటికే ఆగస్టు నెలాఖరు నాటికి 5,69,712 టన్నులు, ఈనెలలో 94,482 టన్నులు సరఫరా చేశారన్నారు.
మంత్రి సుభాష్ వైసీపీని ఎందుకు విమర్శించారు?
విషప్రచారాలు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నందుకే విమర్శించారు.
శెట్టి బలిజలపై ఏం వివాదం తలెత్తింది?
జగ్గిరెడ్డి శెట్టి బలిజలను ఓసిల్లో చేర్చుతున్నారని దుష్ప్రచారం చేయడమే వివాదానికి కారణం.
Read hindi news:hindi.vaartha.com
Read Also: