తెలంగాణ ఆర్టీఐ కమిషన్‌కు కొత్త లోగో ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ (RTI Commission) కు కొత్త లోగోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (RTI New Logo) ఆవిష్కరించారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా, ఆర్టీఐ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలోని బృందం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసింది.ఈ లోగో ఆవిష్కరణను 20వ జాతీయ సమాచార హక్కు వారోత్సవాల సందర్భంగా నిర్వహించారు. రాష్ట్రంలో పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనకు ఈ కొత్త లోగో ప్రతీకగా నిలుస్తుందని అధికారులు తెలిపారు.
Read Also: రోహిత్ ను కెప్టెన్సీ నుండి తప్పించడంపై స్పందించిన గవాస్కర్

కొత్త కమిషనర్ల బృందం సీఎంను కలిసింది
ఈ కార్యక్రమంలో కొత్తగా నియమితులైన కమిషనర్లు బోరెడ్డి అయోధ్యరెడ్డి, పీవీ శ్రీనివాసరావు, మొహిసినా పర్వీన్, దేశాల భూపాల్, మెర్ల వైష్ణవి పాల్గొన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఆర్టీఐ కమిషనర్ పదవులను రేవంత్ రెడ్డి (RTI New Logo)ప్రభుత్వం ఇటీవల భర్తీ చేసిన విషయం తెలిసిందే.
కొత్త కమిషనర్ల బృందం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రిని కలవడం, ఆర్టీఐ వ్యవస్థ మరింత బలపడుతుందనే సంకేతంగా పరిగణించబడుతోంది.
Epaper:https://epaper.vaartha.com/
Read also: