హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా కేటీఆర్‌పై వ్యంగ్యంగా స్పందించారు. కేటీఆర్ జాతకంలో అధికారం అనే రేఖే లేదని, ఆయన దశ బాగోలేకపోవడంతో కేసీఆర్ ఎంత కృషి చేసినా ఫలితం ఉండదని అన్నారు. పుత్ర వాత్సల్యంతో కేసీఆర్ ధృతరాష్ట్రుడిలా మారిపోయారని విమర్శించారు. రేవంత్ మాట్లాడుతూ, “కేటీఆర్ ఎన్నికల ప్రచారం చూస్తుంటే పుష్ప సినిమాలోని శ్రీలీల పాట గుర్తుకొస్తోంది” అని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ పాలన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో వెనక్కి నెట్టిందని ఆయన అన్నారు. “కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం వేల కోట్లు ఖర్చు చేశారు కానీ రైతులకు నీళ్లు ఇవ్వలేకపోయారు. కానీ మా ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ లేకుండా కూడా రికార్డు స్థాయిలో వరి పంట సాధించింది” అని రేవంత్ చెప్పారు.
Read also: CM Revanth Reddy: కేసీఆర్ పథకాలు రద్దు చేయలేదు, కొత్త పథకాలు తీసుకొచ్చాం

Revanth Reddy: కేటీఆర్ జీవితంలో అధికారం అనే రేఖ లేదు
“ఫెవికాల్ బంధం” అని ఎద్దేవా చేశారు.
తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉందని, కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ కొనసాగిస్తూ కొత్త హామీలను అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఉచిత బస్సు ప్రయాణం, ఎస్సీ వర్గీకరణ, కులగణన, రాష్ట్ర గీతం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేశామని గుర్తుచేశారు. రాష్ట్ర బీజేపీ, బీఆర్ఎస్ నేతలపై కూడా ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలది “ఫెవికాల్ బంధం” అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలను గుజరాత్‌కు తరలించేందుకు కేంద్ర నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణకు ఆదేశించినా, కేంద్రం ఇంకా దర్యాప్తు ప్రారంభించకపోవడం అనుమానాస్పదమని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: