ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. జనసేన పార్టీ అభివృద్ధి, సంస్థాగత బలోపేతం దిశగా తీసుకున్న ఈ నిర్ణయం పార్టీకి కొత్త ఊపునిచ్చేలా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్లూరిని నియమిస్తూ పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించారు.
TamilNadu: ఏపీ యువతిపై గ్యాంగ్‌రేప్.. కానిస్టేబుళ్ల ను విధుల నుంచి సస్పెండ్ చేసిన డీఎంకే ప్రభుత్వం
రామ్ తాళ్లూరి (Ram Talluri) పేరు తెలుగు సినీ రంగానికి కూడా బాగా పరిచయమే. ఆయన ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ వ్యవస్థాపకుడు, క్రియేటివ్ డైరెక్టర్‌గా పరిశ్రమలో గుర్తింపు పొందారు. పలు విజయవంతమైన సినిమాలు నిర్మించడమే కాకుండా, కొత్త ప్రతిభను ప్రోత్సహించే నిర్మాతగా కూడా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
రామ్ తాళ్లూరి కేవలం సినీ రంగానికే పరిమితం కాకుండా, ఐటీ రంగంలోనూ తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన లీడ్ ఐటీ కార్పొరేషన్, రామ్ ఇన్నోవేషన్స్ వంటి సంస్థల్లో డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో ఆయనకు సుదీర్ఘ అనుభవం ఉండటం విశేషం.
ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల
అయితే రామ్ తాళ్లూరి జనసేన పార్టీ (Janasena party) కోసం గత కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా రామ్ తాళ్లూరిని నియమిస్తూ పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు.

పార్టీ ప్రధాన కార్యదర్శి (General Secretary of the party) గా జనసేన పార్టీ సంస్థాగత అభివృద్ధి వ్యవహారాలకు సంబంధించిన బాధ్యతలను రామ్ తాళ్లూరి నిర్వర్తిస్తారని పవన్ కల్యాణ్ వెల్లడించారు.‘పార్టీ కోసం పని చేస్తానని 2014లోనే రామ్ తాళ్లూరి నాతో చెప్పారు. అప్పటి నుంచి జనసేన పార్టీ పట్ల అంకితభావంతో, అప్పగించిన బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు.
రామ్ తాళ్లూరి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు
పార్టీ తెలంగాణ విభాగంలో రామ్ తాళ్లూరి క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో నిపుణుడైన రామ్ తాళ్లూరి సాఫ్ట్‌వేర్ సంస్థల యజమానిగా ఉన్నారు. రామ్ తాళ్ళూరికి ఉన్న సంస్థాగత నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేశాం” పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: