బీహార్‌లో ఎన్డీయే కూటమి సాధించిన విజయంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న ప్రకటించగా, ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ నెల 19 లేదా 20 తేదీల్లో కొత్త ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. పాట్నాలోని గాంధీ మైదానం ఈ కార్యక్రమానికి వేదికగా మారుతోంది. అక్కడ భారీ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
Read also: Nitish Kumar CM : ఎన్‌డీయే భారీ విజయంతో బీహార్‌లో కొత్త ప్రభుత్వం

Nitish kumar: మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
నరేంద్ర మోదీతో పాటు
ప్రమాణ స్వీకార వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హాజరవుతారని సమాచారం. మరోసారి నితీశ్ కుమార్ (Nitish kumar) ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారని ఎన్డీయే వర్గాలు ప్రస్తావిస్తున్నాయి. అయితే, కొత్త సీఎం ఎవరు అన్న విషయాన్ని అధికారికంగా ఇప్పటికీ కూటమి ప్రకటించలేదు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: