Narendra Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra) వాద్రా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తమ పార్టీ చేస్తున్న పోరాటం, ఒకప్పుడు మహాత్మా గాంధీ బ్రిటిష్‌లపై చేసిన స్వాతంత్ర్య యుద్ధంలాంటిదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ వాడిన “కట్టా” (నాటు తుపాకీ) వంటి పదాలు ఆయన హోదాకు తగవని ఆమె విమర్శించారు. “ఒకవైపు అహింసను ప్రబోధిస్తూ ‘వందే మాతరం’ అంటారు, మరోవైపు దౌర్జన్య భాష వాడటం ఏమిటి?” అని ఆమె ప్రశ్నించారు.
Read also: Tirumala: శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

Narendra Modi: మోదీ సామ్రాజ్యంపై మా పోరాటం
పేదలకు మాత్రం ఎటువంటి సాయం చేయడం లేదు
Narendra Modi: బీహార్‌లో నిరుద్యోగం, వలసలు పెరగడానికి ఎన్డీయే ప్రభుత్వమే కారణమని ప్రియాంక ఆరోపించారు. “నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో పొరపాట్లు దేశంలోని చిన్న, మధ్యతరహా వ్యాపారాలను దెబ్బతీశాయి” అని ఆమె అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కొద్దిమంది కార్పొరేట్ మిత్రులకు అప్పగిస్తున్నారని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో దేశానికి ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్ వంటి సంస్థలు లభించాయని ఆమె గుర్తుచేశారు. బీజేపీ ఎన్నికల ముందు మహిళలకు డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోందని విమర్శించారు. “కార్పొరేట్ రుణాలను మాఫీ చేస్తున్నారు కానీ పేదలకు మాత్రం ఎటువంటి సాయం చేయడం లేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బీహార్‌లో 65 లక్షల ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించారని ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఎన్నికల సంఘం అధికారులు కూడా ఈ కుట్రలో భాగమయ్యారని ఆమె ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ మాట్లాడుతూ, బీహార్ మొదటి దశలో విపక్ష కూటమి ఆధిక్యంలో ఉందని, బీజేపీ అనేక స్థానాల్లో ఓడిపోబోతుందని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: