हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Kavitha: నిరంజన్ రెడ్డి అవినీతిపై పిల్లాడిని అడిగినా చెబుతాడు: కవిత

Rajitha
News Telugu: Kavitha: నిరంజన్ రెడ్డి అవినీతిపై పిల్లాడిని అడిగినా చెబుతాడు: కవిత

వనపర్తి: కృష్ణానదిని కబ్జాచేసి ఫామ్ హౌస్ కట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మాజీ మంత్రి పై నిరంజన్ రెడ్డి అవినీతిని చిన్న పిల్లాడిని అడిగిన చెబుతాడని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) పేర్కొన్నారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగం గా ఆది, సోమవారం ఆమె వనపర్తి జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ మేరకు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలు లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వనపర్తిలో నిరంజన్ రెడ్డి ఘోరాతిఘోరంగా అరాచకాలకు పాల్పడ్డారని చిన్నపిల్లాడిని అడిగిన ఆయన దారుణాలను చెబుతున్నారని, ఇలాంటి వారి వల్ల జిల్లాలో బీఆర్ఎస్ బతికి బట్టకట్టడం కష్టం అని అన్నారు. బీసీ యువకులపై కేసులు పెట్టించి వారిని రక్తాలు వచ్చేట్టు కొట్టించాడని ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్నాడని ఆమె ప్రశ్నించారు. కృష్ణానది కబ్జా చేసి ఫామ్ హౌజ్ కట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ఆమె అన్నారు.

Read also: Cheating : డబ్బు, నగలతో ఊడాయించిన నిత్య పెళ్లికూతురు

Kavitha

Even a child would tell about Niranjan Reddy’s corruption: Kavitha

నిరంజన్ రెడ్డి కారణంగా బీఆర్ఎస్ దెబ్బతింటోందని

మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హరీశ్రరావు మనిషి అని సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవటం లేదా అన్నారు. నిరంజన్ రెడ్డి చేసిన ఆరాచకాలను కెసిఆర్ కు హరీష్ రావు తెలియనివ్వడం లేదా అని అన్నారు. అందుకే మీడియా ద్వారా పెద్ద సార్ కు ఆయన ఘోరాలను తెలియజేస్తున్నానని తెలిపారు. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి కారణంగా బీఆర్ఎస్ కోలుకోని విధంగా దెబ్బతింటోందని చెప్పారు. అంతకుముందు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సందర్శించి అక్కడ విద్యార్థులతో ఉపాధ్యాయులతో మాట్లాడారు. కళాశాలకు సరిపడా అధ్యాపకుల సిబ్బంది లేరని విద్యార్థులకు కూడా సరైన వసతులు లేక పాలిటెక్నిక్ కళాశాల భవనం శిథిలావస్థకు చేరుకుందని ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేసి కళాశాల మరమ్మతులు చేయించాలని కోరారు. దేశవ్యాప్తంగా చేనేత కార్మికులు దుర్భర జీవనం సాగిస్తున్నారని పేర్కొ న్నారు. చేనేత కార్మికులను గుర్తించి వారికి ఐదు లక్షల నుంచి 10 లక్షల వరకు రుణాలు అందించి ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు.

చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టడం ఏంటని

కనాయిపల్లి దగ్గర శంకర సముద్రం ప్రాజెక్టును పూర్తి చేసి మరో 40 వేల ఎకరాలకు నీళ్లు అందించవచ్చని అదే ప్రాంతానికి చెందిన నాయకుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి అవినీతి మరక లేనివారు ఆయన కేసీఆర్ కు విషయాన్ని తెలియజేసి ప్రజలకు న్యాయం చేయాల్సి ఉండే. ఇప్పటికైనా ఈ అంశం పై ప్రజల తరఫున ముందుండి పోరాడాలని ఆమె కోరారు. ఆదివారం మాత శిశు సంరక్షణ కేంద్రంలో ఆసుపత్రి సిబ్బంది డాక్టర్లు కెపాసిటీ మించి పని చేస్తున్నారని వెంటనే తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆసుపత్రి కార్మికులకు మూడు నెలల నుండి జీతాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వెంటనే కార్మికులను పర్మినెంట్ చేసి వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వనపర్తి జిల్లాలో నాలుగున్నర లక్షల టన్నుల ధాన్యం. పండుతుందని అంచనా వేశారు. తెలంగాణ మహిళలకు ఇచ్చే చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. ఇందిరమ్మ పేరును ప్రసన్నం చేసుకోవడం కోసం చీరలను ఇందిరమ్మ జయంతి నుండి సోనియమ్మ పుట్టినరోజు వరకు కొనసాగిస్తారని అన్నారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870