కర్ణాటకలో సీఎం పదవి మార్పుపై రాజకీయ చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న సిద్ధరామయ్య (siddaramaiah) స్థానంలో డీకే శివకుమార్‌ను తీసుకురావాలన్న వాదన బలపడుతోంది. దీనికోసం డీకే వర్గం ఎమ్మెల్యేల బృందం ఢిల్లీకి వెళ్లి అధిష్ఠానంతో సమావేశమై, ఆయనకు సీఎం బాధ్యతలు అప్పగించాలని కోరింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డీకేకు భరోసా ఇచ్చినట్లు ఆ వర్గం చెబుతోంది. వారం రోజుల్లో హైకమాండ్ నిర్ణయం వెలువడవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు సిద్ధరామయ్య కూడా హైకమాండ్‌ను కలిసి కేబినెట్ విస్తరణ కోరడం, తన పదవిని కొనసాగించాలనే ప్రయత్నంగా విశ్లేషకులు చూస్తున్నారు.
Read also: Nishanth kumar: తండ్రి గెలుపుపై తొలిసారి స్పందించిన కుమారుడు నిశాంత్

Karnataka: Intense debate over CM change once again in Karnataka
సిద్ధరామయ్యపై నమ్మకం ఉన్నప్పటికీ
ఇదే సమయంలో డీకే శివకుమార్‌కు మద్దతు ఇచ్చే నేతలు ఆయనకే సీఎం వైపు అర్హత ఉందని, కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తేవడంలో ఆయన పాత్ర కీలకమని వాదిస్తున్నారు. రామనగర ఎమ్మెల్యే ఇక్బాల్ హుస్సైన్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఢిల్లీలో అగ్రనేతలతో భేటీ అయి తమ అభిప్రాయాలు వెల్లడించారు. సిద్ధరామయ్యపై నమ్మకం ఉన్నప్పటికీ, పార్టీ ఇచ్చిన హామీకి నిలబడుతారని కూడా వారు అంటున్నారు. దీంతో కర్ణాటకలో సీఎం పదవి మార్పు అంశం రాజకీయ వర్గాల్లో రసకందాయంగా మారింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :