हिन्दी | Epaper
కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

News Telugu: Harish Rao: ఆడబిడ్డ రాజకీయమేంటో చూపిస్తా: కవిత

Rajitha
News Telugu: Harish Rao: ఆడబిడ్డ రాజకీయమేంటో చూపిస్తా: కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీపైనే కాకుండా మాజీ మంత్రి హరీశ్‌రావుపైన కూడా ఘాటైన విమర్శలు చేశారు. వరంగల్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమంలో మాట్లాడుతూ, పార్టీ తనను అవమానకరంగా సస్పెండ్ చేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నేను కూడా తెలంగాణ బిడ్డనే. ఆకలిని తట్టుకుంటా కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోను” అని స్పష్టం చేశారు. కవిత మాట్లాడుతూ, “ఇరువై ఏళ్ల పాటు పార్టీ కోసం పనిచేశాను. ఉద్యమ సమయంలో పల్లెల్లో తిరిగాను. కానీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్‌కే పరిమితం చేశారు. చివరికి ఎటువంటి నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. ఇకపై బీఆర్ఎస్‌తో నాకు రాజకీయ బంధం లేదు. కేసీఆర్‌ను ఇప్పుడు తండ్రిగానే కలుస్తాను” అని పేర్కొన్నారు.

Read also: Jubilee Hills election: డబ్బులు పంచుతూ పట్టుబడ్డ 11 మంది అరెస్ట్

Harish Rao

Harish Rao: ఆడబిడ్డ రాజకీయమేంటో చూపిస్తా: కవిత

కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు

మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish rao) పై ఆమె సంచలన ఆరోపణలు చేశారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ కాంట్రాక్ట్ రూ.1,100 కోట్ల అంచనాతో హరీశ్‌రావుకు చెందిన బినామీ కంపెనీకి ఇచ్చారని, తర్వాత అంచనాను రూ.1,700 కోట్లకు పెంచారని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్‌ విచారణ చేసినా, చర్యలు తీసుకోకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. “ఎన్నికలకు ముందు చేసిన హామీలను ప్రభుత్వం మరచిపోయింది. మెగా డీఎస్సీ ప్రకటించడంలో ఆలస్యం చేస్తున్నారు. గ్రూప్స్ పరీక్షల్లో పారదర్శకత ఉండాలి. ధాన్యం కొనుగోలు, తుపాన్ బాధితులకు సహాయం లాంటి అంశాల్లో ప్రభుత్వం విఫలమైంది” అని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870