H1B Visa: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తున్నారు. విపరీతమైన సుంకాలను విధిస్తూ, ప్రపంచ ట్రేడ్ వార్కు కారణమయ్యారు. ఇక వీసాలపై తన ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. స్వదేశీయులకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో విదేశీయులను టార్గెట్ చేస్తూ, వారిని వారివారి స్వదేశాలకు యుద్ధ ప్రాతిపదికంగా పంపించి వేస్తున్నారు. అమెరికా ఫస్ట్ నినాదంతో పలు నిర్ణయాలను తీసుకుంటూ, ఉద్యోగులకు, విద్యార్థులకు నెమ్మదిలేకుండా చేస్తున్నారు. తాజాగా పెట్టుబడి సంస్థ అరిజోనా సిఈవో, అమెరికా ప్రభుత్వ సమర్థత విభాగం మాజీ కీలక అధికారి జేమ్స్ ఫిష్బ్యాక్ భారతీయులను టార్గెట్ చేస్తూ పలు కీలక వ్యాఖ్యల్ని చేశారు.
Read also: Bihar Elections 2025: సీపీఐ నుంచి బరిలోకి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సోదరి

H1B Visa: మా దేశంలో మీ పెత్తనమెందుకు
‘అమెరికన్ కంపెనీలు విదేశీ కార్మికులను ముఖ్యంగా భారతీయులను ఉపయోగించి తమ స్వదేశీ ఉద్యోగులను అణగదొక్కుతున్నాయని’ ఆరోపించారు జేమ్స్. పదేపదే నిందిస్తున్న జేమ్స్ జేమ్స్ ఫిష్బ్యాక్ అక్టోబరు 26న తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. అమెరికన్ కంపెనీలు ఈ ఉద్యోగాలను అమెరికన్లను కనుగొనలేమంటూ పదేపదే చెబుతన్నాయి. కానీ నిజం ఏమిటంటే, వారి అమెరికన్ అభ్యర్థులను ఇంటర్వ్యూ చేయడానికి కూడా సిద్ధంగా లేరని పేర్కొన్నారు. ఫిష్బ్యాక్ ప్రకారం చాలా కంపెనీలు ఉద్యోగ ప్రకటనలను అస్పష్టంగా లేదా కనబడని పద్ధతిలో ప్రచురించి, అమెరికన్ అభ్యర్థులు దరఖాస్తు చేయకుండా చూస్తున్నాయి. ఆ తర్వాత ఎవరూ అప్లై చేయలేదనే పేరుతో విదేశీ కార్మికులను దిగుమతి చేసుకుంటున్నాయి.
ఫలితంగా, అర్హత కలిగిన అమెరికన్ (America) లకు ఉద్యోగ అవకాశాలు దూరమవున్నాయని, జీతాలు తగ్గుతున్నాయని, వారి గౌరవం కూడా దెబ్బ తింటోందన్నారు. ఇది చాలా అవమానకరమైనది. ఈ హెచ్ 1బి వీసా (H1B Visa) మోసాన్ని ఇప్పుడు పూర్తిగా ఆకూల్చివేయాల్సిన సమయం వచ్చిందని జేమ్స్ గట్టిగా పేర్కొన్నారు. విదేశీ ప్రతిభ కావాలంటూనే విమర్శలు ఫిష్బ్యాక్ కేవలం హెచ్1బి వీసా వ్యతిరేకతతో ఆగలేదు. ఆయన మొత్తం వలస వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేయాలని కూడా కోరారు. చట్ట బద్ధమైన వలసలకైనా నేను మద్దతు ఇవ్వను అని అన్నారు. ఒకవైపు అమెరికన్ సంస్థలు విదేశీ ప్రతిభ అవసరమని చెబుతుంటే, మరోవైపు ఫిష్బ్యాక్ వంటి నేతలు ఆ విధానాలను అమెరికన్ కార్మికుల దోపిడిగా అభివర్ణిస్తున్నారు. తాజాగా మొదలైన ఈ వివాదం భారత-అమెరికన్ టెక్ సంబంధాలతో పాటుగా ఇవమ్మిగ్రేషన్ పాలసీల భవిష్యత్తుపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది.
జేమ్స్ ఫిష్‌బ్యాక్ ఎవరు?
జేమ్స్ ఫిష్‌బ్యాక్ అమెరికాలోని పెట్టుబడి సంస్థ అరిజోనా సీఈఓ మరియు అమెరికా ప్రభుత్వ సమర్థత విభాగం మాజీ అధికారి.
ఆయన ఏ వ్యాఖ్యలు చేశారు?
ఆయన అమెరికన్ కంపెనీలు భారతీయులను వంటి విదేశీ కార్మికులను ఉపయోగించి అమెరికన్ ఉద్యోగులను అణగదొక్కుతున్నాయని విమర్శించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: