బిహార్ అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ వాతావరణంలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore)పై ఎన్నికల సంఘం (EC) కీలక చర్య తీసుకుంది. రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ పరిణామం బిహార్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also: E Vehicle Ban : నవంబర్ 01 నుంచి ఢిల్లీలో ఈ వాహనాలు బ్యాన్
వివరాల్లోకి వెళ్తే — ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) మొదట పశ్చిమబెంగాల్‌లో ఓటరుగా నమోదయ్యారు. ఎన్నికల జాబితాలో ఆయన పేరు WB రాష్ట్రంలోని ఒక నియోజకవర్గంలో ఉందని EC రికార్డులు చెబుతున్నాయి.

EC వివరణ ఇవ్వాలని నోటీసు
అయితే, తర్వాత ఆయన స్వస్థలమైన బిహార్ (Bihar) లోని కర్గహార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా మళ్లీ నమోదు అయ్యారు. రెండుచోట్ల ఒకేసారి ఓటు హక్కు కలిగి ఉండడం చట్ట విరుద్ధం కావడంతో ఎన్నికల సంఘం దీనిపై సీరియస్‌గా స్పందించింది.
రెండు చోట్ల ఓట్లుండటాన్ని గుర్తించిన EC వివరణ ఇవ్వాలని నోటీసు ఇచ్చింది. అయితే బిహార్‌లో ఓటరుగా నమోదయ్యాక WB ఓటును తొలగించాలని PK అప్లై చేశారని ఆయన టీమ్ సభ్యులు తెలిపారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: