హైదరాబాద్ (సైఫాబాద్) : బంజారా (Banjara) ల డిమాండ్ల సాధన కోసం ఈ నెల 19, 20 తేదీలలో చలో ఢిల్లీ పేరిట జంతర్ మంతర్ వద్ద బంజారాల నంగరా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని బంజారా భారతి, అఖిల భారతీయ బంజారా మహా సేవా సంఘ్ ప్రతినిధి, మాజీ ఎంపి ఎస్.రవీంద్రనాయక్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం బషీర్బాగ్ ప్రెస్ కబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న బంజారీలకు జరిగిన అన్యాయాలపై చర్చా కార్యక్రమం కొనసాగుతుందని, అలాగే 20న బంజారాల అభివృద్ధికి కృషి చేసిన స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి, తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తామని, మహారాష్ట్రలో బంజారాల ఆస్తులను కాపాడిన ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలుపుతామని వివరించారు.
Read also: Supreme Court: నేడు సుప్రీంకోర్టులో BRS MLAల ఫిరాయింపు కేసు విచారణ

CII Summit: Increased confidence among investors in the double engine government
బంజారా కాంస్య విగ్రహాలను
పార్లమెంట్ ప్రాంగణంలో లక్షీషా బంజారా, మకన్షా బంజారా కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని, బంజారా భాష గోర్బోలికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి పార్లమెంట్కు పంపాలని, దీన్ని వెంటనే అమోదించాలని, న్యూఢిల్లీలోని రాయాసీనా హిల్స్ నుంచి ప్రారంభమయ్యే అన్ని మార్గాలకు లక్కీషా, మకన్షా, బాయి హేమా తదితర బంజారా నాయకుల పేర్లును పెట్టాలని కోరారు. ఈ సమావేశంలో బంజారా నాయకులు అశోక్ రాథోడ్, బాలునాయక్, మోహన్నాయక్, నాగవాణి, సోని తదితరులు పాల్గొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: