హైదరాబాద్ : ఎన్నికల కమిషన్ కు బిజెపి(BJP) ఎంపి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఓటర్ కార్డులను కాంగ్రెస్ నేతలు పంపిణీ చేయడంపై ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా రఘునందన్ మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్ ఐడీ కార్డులు పంచిపెట్టే దుకాణం పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ చేతుల్లోకి రావాల్సిన ఓటర్ కార్డులు.. కాంగ్రెస్ నేతల చేతుల్లోకి ఎలా వెళ్లాయని ఆయన సూటిగా ప్రశ్నించారు బిజెపి(BJP) ఎంపి. బహిరంగంగా ఓటర్ కార్డులను పంచుతుంటే ఎన్నికల కమిషన్, జిహెచ్ఎంసీ కమిషనర్ ఎందుకు మాట్లాడటం లేదని ఎంపీ రఘునందన్ ప్రశ్నించారు.
Read Also: Jupally Krishna Rao:ఆర్ట్ గ్యాలరీ వినియోగం పెంచాలి

జూబ్లీహిల్స్ ఓటర్ కార్డులను పంచుతున్న నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా పోటీకి ఎలా అర్హుడు అవుతాడని రఘునందన్ మండిపడ్డారు. నవీన్ యాదవ్కు ఓటర్ ఐడీ కార్డులు ఎవరిచ్చారు, జిహెచ్ఎంసీ కమిషనర్ ఇచ్చారా..? ఎన్నికల కమిషన్(Election Commission) ఇచ్చిందా..? అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) చేస్తామంటే గగ్గోలు పెడుతున్న మేధావులు ఇలాంటి వాటి మీదా స్పందించాలని తెలిపారు. ఎస్ఐర్ చేస్తామంటే ఓట్ల చోరీ అంటున్నారని, ఇది ఐడీ కార్డుల చోరీనా..? అని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో ఓటర్ ఐడీ కార్డులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. జూబ్లీ హిల్స్ లో ఓటర్ ఐడీ కార్డుల పంపిణీపై వెంటనే ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని రఘునందన్ రావు డిమాండ్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: