Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది చలికాలంలో హాట్ హాట్గా మారింది. నేతలు నువ్వా నేనా అన్నట్లు పోటీపోటీ ప్రచారం చేస్తున్నారు. దీంతో బీహార్ ఎన్నికల సందడితో రాజకీయ వేడిని పుట్టిస్తున్నది. ఎలాగైనా గెలవాలని ఎన్డీయే కూటమి.. ఈసారి తమదే గెలుపు అని ఆర్జేడీ లు ప్రచారం చేస్తున్నారు. బీహార్ లో ఇప్పటికే ప్రధాని మోదీ నుంచి బడా రాజకీయ నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit shah) కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ప్రస్తుతం ఏ సీటు ఖాళీగా లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాక నితీశ్ కుమార్ బీహార్ సీఎంగా కొనసాగుతారని, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉంటారని తేల్చి చెప్పారు.
Read also: Bihar Assembly elections: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇండియా కూటమి మేనిఫెస్టో విడుదల

Bihar Elections
Bihar Elections: వారివి వారసత్వ రాజకీయాలు బీహార్ లోని దర్భంగాలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన తనయుడిని ముఖ్యమంత్రిగా చేయాలని చూస్తే సోనియా గాంధీ తన కొడుకును ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆర్జేడీ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ సీఎం అభ్యర్థిగా తేజస్వి యాదవ్ ను ఇప్పటికే ప్రకటించింది. ఎన్డీయే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. ఈ నేపథ్యంలోనే నితీశ్ కుమార్ నాయకత్వంలోనే బీహార్ న్నికలకు వెళతామని ఇటీవల ప్రధాని మోదీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. బుధవారం అమిత్ షా కూడా ఇదే విషయాన్ని మరోసారి తేల్చి చెప్పారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: