తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై , విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏపీలోని ప్రస్తుత పరిస్థితులను, రాజకీయ నాయకుల తీరును ఎండగట్టారు. రాష్ట్ర విభజన సమయం నుంచి నేటి విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వరకు అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు గుప్పించారు.
Read Also: Palamaner News: యువకుడు అనుమానాస్పద మృతి
“విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. ప్రజల భాగస్వామ్యంతో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అయ్యింది. 1970లో ఇందిరాగాంధీ పార్లమెంటులో ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. రూ.14,000 కోట్లు వ్యయం చేసి స్థాపించిన ఫ్యాక్టరీ వల్ల విశాఖపట్నం అభివృద్ధి చెందింది. వేలు, లక్షల కుటుంబాలు ఉక్కుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆనాటి ఉద్యమం కారణంగా ఎంతోమంది నాయకులుగా ఎదిగారు.

కులాల ప్రాతిపదికన రాజకీయం చేసే వారికే ఓట్లు
వెంకయ్య నాయుడు కూడా ఉద్యమం ద్వారా జాతీయ స్థాయి నేతగా అవతరించారు” అని జగ్గారెడ్డి చెప్పారు.ప్లాంట్ రక్షణ కోసం కార్మికులు ఎన్నాళ్ల నుంచో పోరాడుతున్నా.. ప్రభుత్వాలు మారినా వారి కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ హయాంలో కానీ.. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో కానీ ప్రైవేటీకరణ దిశగానే అడుగులు పడుతున్నాయని అన్నారు. ఏపీ ప్రజలు కేవలం కులాల ప్రాతిపదికన రాజకీయం చేసే వారికే ఓట్లు వేసి గెలిపిస్తున్నారని..
సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతం అయితేనే ఇలాంటి ప్రజా ఆస్తులను కాపాడుకోగలమని ధీమా వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌పై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మాజీ సీఎం జగన్, మోదీ నిర్ణయాలకు అనుగుణంగా ఆడుతున్నారన్నారు. తమకు 20 మంది ఎంపీలను ఎంపీలను ఇస్తే.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుంటామన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: