हिन्दी | Epaper
పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీసులకు సంక్షేమ రుణాలు ఒక్క రోజులోనే నేడు జనసేన ‘పదవి-బాధ్యత’ కార్యక్రమం టీటీడీలో ఉద్యోగాలు.. మీరు అప్లై చేసారా? వాట్సాప్‌లో ‘పోలీస్ శాఖ సేవలు’ టెట్ ‘కీ’ విడుదల ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ముస్తాబు’ అమలు టీటీడీ భారీ రాయితీలు ప్రకటించింది అమరావతికి మరో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రేషన్ కార్డుదారులకు శుభవార్త ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు శుభవార్త చెప్పిన సీఎం అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్

AP Government: ఫైళ్లూ కదలవు… పనులూ జరగవు.. నిస్తేజంలో కూటమి కార్యకర్తలు

Rajitha
AP Government: ఫైళ్లూ కదలవు… పనులూ జరగవు.. నిస్తేజంలో కూటమి కార్యకర్తలు

ధర్మవరం : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో టిడిపి, బిజెపి, జనసేన కార్యకర్తల్లో నూతన ఉత్సాహం, సంతోషం పొంగుకొచ్చింది. నూతన ప్రభుత్వ ఏర్పాటుతో వారి కష్టాలు తొలగిపోతాయి అనుకున్న తరుణంలో ముఖ్యంగా కూటమిలోని మూడు పార్టీల నాయకులు తమ కార్యకర్తలకు ఇచ్చే గుర్తింపు గాని, ఇటు రెవెన్యూ శాఖలోను, అటు మున్సిపాలిటీల్లోనూ పనులు చేసిపెట్టడంలో చొరవ, చలనం గాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూటమి కార్యకర్తలు. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కూటమి ఏర్పాటులో భాగంగా బిజెపి అభ్యర్థులు పోటీ చేసి గెలిచిన నియోజకవర్గాల్లో కూటమి కార్యకర్తల పరిస్థితి మరీ దయనీయంగా మారిందని చెప్పవచ్చు. ఉమ్మడి అనంతపురం (Ananthapuram) జిల్లాలో ఆది నుండి టిడిపికి మంచిపట్టున్న నియోజకవర్గాలలో ధర్మవరం ఒకటి, కూటమి పొత్తులో భాగంగా ఈ ధర్మవరం నియోజకవర్గం బిజెపికి కేటాయించగా అత్యధిక మెజార్టీతో బిజెపి పార్టీ అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ గెలుపొంది మంత్రి పదవి సైతం చేపట్టాడు.

Read also: TIFFA Scan: రాష్ట్రంలో తొలి సారి 7 ఆస్పత్రుల్లో TIFFA యంత్రాల ఏర్పాటు

AP Government

AP Government

అర్ధం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన

దీంతో ఈ మూడు పార్టీల కూటమి కార్యకర్తలు ధర్మవరం నియోజకవర్గ శాసన సభ్యులు, మంత్రి దృష్టికి తమ సమస్యలు చెప్పుకోవాలా… లేక నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్ దృష్టికి తమ సమస్యలు పరిష్కారం చూపుతారా అన్నది అర్ధం కాక పరిటాల శ్రీరామ్ వద్దకు ఒకసారి, బిజెపి నాయకుల వద్దకు ఒకసారి వెళ్లి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. అయితే ఎవరికి చెప్పుకున్నా తమ సమస్యలు పరిష్కారం కాకుండా వున్నాయని పరిస్థితి అర్ధం కాక నిస్తేజంలో నిలిచిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అయోమయంతో ఆవేదన చెందుతున్నారు. కూటమి గెలుపు కోసం మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసినా గెలుపు తరువాత తమ సమస్యలు గానీ పనులు గాని పరిష్కరించుకునేందుకు ఎవరి వద్దకు వెలితే సక్రమంగా పనులు జరుగుతాయో అర్ధం కాని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు.

అధికారుల వద్ద ప్రదక్షిణలు చేస్తే తప్ప

నియోజకవర్గ స్థాయిలో మూడు పార్టీల నాయకులకు సమన్వయం మెండుగా ఉన్నప్పటికీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తల సమస్యల వద్దకు వచ్చేటప్పటికి క్షేత్రస్థాయిలో సమన్వయంగా పనులు జరగడం లేదని అర్థమవుతోంది. పై స్థాయిలో నాయకులు వారి పనులు చక్కబెట్టుకుంటుండగా క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల కార్యకర్తలకు ఎటువంటి పనులు జరగడం లేదని అధికారుల వద్ద ప్రదక్షిణలు చేస్తే తప్ప పనులు మాత్రం జరగడంలేదని తమ నాయకుల పై నిష్టూరం వెళ్లగక్కుతున్నారు. తమ పనులు చేసుకోవాలంటే ఎట్లాగైనా బిజెపి నాయకుల వద్దకి వెళ్లాల్సిందే కాబట్టి పార్టీని మారితే సరిపోతుందని పార్టీ కండువాని సైతం మార్చి బిజెపిలోకి చేరిపోయారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలు.

కూటమి ఏర్పాటుతో తమ సమస్యలు తీరుతాయని

ఇక ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసిపి నాయకులు మరి కొంతమంది ఉన్న ఆస్తులు కాపాదుకునేందు కోసమో, లేక పనులు చేసుకోవచ్చన్న ఆశతోనో వైసిపి పార్టీని వీడి బిజెపి తీర్థం పుచ్చుకొని హడావిడిగా నాయకుల వద్దకు, వారు చేసే పార్టీ కార్యక్రమాలకు వరుగులు పెడుతున్నారు. అయితే అధికారం కూటమిలో పార్టీ నాయకుడిది కావడం, మరో పార్టీ నాయకుడికి తమ పార్టీ అధికారం ఉన్నప్పటికీ తన చేతిలో అధికారం లేక కార్యకర్తలు, నాయకులు అడిగిన పనులు చేసి పెట్టలేక తమ అనుకున్న వారి పనులు మాత్రమే జరుపుకుంటూ ధర్మవరం నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు. కూటమి పార్టీ నాయకులు, కూటమి ఏర్పాటుతో తమ సమస్యలు తీరుతాయని ఎదురుచూసిన కూటమి కార్యకర్తలకు ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయి నిచ్చేష్టులై నిస్తేజంలో మునిగిపోయారని చెప్పవచ్చు.

ఏ నాయకుడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో

రెవెన్యూ పనులు కోసం అధికారులకు కూటమి కార్యకర్తలు ఇచ్చిన దస్త్రాలను టేబుల్ పై ఉంచుకుంటున్నారే గాని పనులు మాత్రం చేయడం లేదని, కాల్లరిగేలా కార్యాలయం చుట్టూ తిరగడమే తప్ప రెవెన్యూ పనులు జరగక ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఏ నాయకుడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో అర్థం అయోమయంలో మునిగిపోతున్నారు కూటమి కార్యకర్తలు. ఇక ధర్మవరం మున్సిపాలిటీలో అధికారుల పరిస్థితి చూస్తే కూటమి పార్టీ నాయకుల కంటే వీరి రాజకీయ క్రీడలే అధికంగా ఉన్నాయని అనిపిస్తోంది. కూటమిలో ఓ పార్టీ నాయకులు పనుల నిమిత్తం మున్సిపల్ అధికారుల వద్దకు వెళితే మిగిలిన రెండు పార్టీల నాయకులపై చెప్పి ఆ పనులను చేయకుండా కుంటి సాకులు చెప్పి తప్పించుకు తిరుగుతున్నారని కూటమి నాయకులు, కార్యకర్తలు బహిరంగంగానే అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి పార్టీలోని మూడు పార్టీల పెద్ద నాయకులకు నిజంగానే సమన్వయం ఉందా లేక తమ పనులు చక్క పెట్టాల్సి వస్తుందని కార్యకర్తలకు సాకులు చెబుతున్నారా అని కూటమి కార్యకర్తలు అర్థం కాక జుట్టు పీక్కునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీ నాయకుల మధ్య సమన్వయం ఉంటే మున్సివల్ సిబ్బందితో వీధుల్లో చెత్తకుప్పలు ఎత్తించడానికి, మురుగు కాలువలు శుభ్రం చేయించడానికి వెళ్లి నియోజకవర్గ స్థాయి నాయకులు ఫోటోలకు ఫోజులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని కూటమి కార్యకర్తలు బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు.. ఇప్పటికైనా కూటమి పార్టీ నాయకులలో మార్పు వచ్చి కూటమి కార్యకర్తలకు పనులు చేసి పెట్టి న్యాయం జరిగేలా చూడాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు..

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870