Anjan Kumar Yadav-జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ లోపల హీటెక్కుతోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సీనియర్ నాయకుడు అంజన్ కుమార్ యాదవ్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆసక్తి వ్యక్తం చేశారు. ఆయన కేవలం టికెట్ మాత్రమే కాకుండా, గెలిస్తే మంత్రివర్గంలో చోటు కల్పించాలని షరతు పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. విలేకరులతో మాట్లాడిన ఆయన, “నా ఓటు ఇక్కడే ఉంది, నేను స్థానికుడిని. గతంలో సికింద్రాబాద్ ఎంపీగా(Secunderabad MP) రెండు సార్లు గెలిచి జూబ్లీహిల్స్ అభివృద్ధికి కృషి చేశాను” అని గుర్తుచేశారు. పార్టీ కష్టసమయంలో అండగా నిలిచానని, ఇప్పుడు అవకాశం ఇవ్వాలని కోరారు.

సామాజిక వర్గ ప్రాతినిధ్యం అంశం
రాష్ట్రంలో తమ సామాజిక వర్గానికి సరైన ప్రాతినిధ్యం లేకపోవడంపై అంజన్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే తనకు జూబ్లీహిల్స్ టికెట్‌తో పాటు గెలిచిన తర్వాత మంత్రి పదవిని ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ యూత్ కాంగ్రెస్ కోటా ద్వారా ఎంపీగా అవకాశం పొందాడని, నిరుద్యోగ సమస్యలపై పోరాటం కొనసాగించాడని ఆయన ప్రస్తావించారు.
దానం నాగేందర్ స్పందన
ఇక మరోవైపు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్(Danam Nagender) కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమని తెలిపారు. అలాగే, ఫిరాయింపు ఆరోపణలపై స్పీకర్ నుండి ఎలాంటి నోటీసులు అందలేదని, అవి వచ్చిన తర్వాత అన్ని అంశాలను పరిశీలించి సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఎవరు ఆసక్తి చూపుతున్నారు?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.
అంజన్ కుమార్ యాదవ్ డిమాండ్ ఏమిటి?
టికెట్‌తో పాటు గెలిస్తే మంత్రి పదవిని ఇవ్వాలని ఆయన కోరుతున్నారు.
Read hindi News: Hindi.vaartha.com
Read also: