తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) సమావేశమయ్యారు. హైదరాబాద్ నగర పర్యటనలో ఉన్న అఖిలేశ్ యాదవ్, జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారిరువురు జాతీయ రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం.
Read Also: 2nd Phase Gram Panchayat Elections: రెండో విడత ప్రచారానికి తెర

రాజకీయ పరిస్థితులపై చర్చ
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోనూ సమావేశమైన అఖిలేశ్ రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: