ఐబొమ్మ I Bomma బెదిరింపుల ప్రచారంపై తెలంగాణ ప్రభుత్వ స్పష్టత సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన “ఐబొమ్మ వెబ్‌సైట్ తెలంగాణ పోలీసులకు హెచ్చరికలు జారీ చేసింది” అన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. రాష్ట్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ప్రకటన ప్రకారం, ఈ సమాచారం అసత్యమని, ప్రజలు నమ్మరాదని సూచించింది.ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం, సోషల్ మీడియాలో పంచుకుంటున్న స్క్రీన్‌షాట్‌లు 2023 నాటివి. అంతేకాకుండా, ఆ హెచ్చరికలు పోలీసులకు కాకుండా సినిమా పరిశ్రమను ఉద్దేశించినవి మాత్రమేనని స్పష్టం చేసింది. తెలంగాణ పోలీసులకు ఐబొమ్మ నుంచి ఎలాంటి బెదిరింపులు అందలేదని అధికారికంగా తెలిపింది.
Rajnath Singh: హైదరాబాద్‌కు చేరుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

ఇకపోతే, కొన్ని మీడియా సంస్థలు కూడా ఈ పాత సమాచారం ఆధారంగా వార్తలు ప్రచురించడంతో, ఈ ప్రచారం మరింత వైరల్ అయ్యింది. దీనిని ప్రభుత్వం “తప్పుడు సమాచారం”గా కొట్టిపారేసింది.
అదేవిధంగా, ప్రజలు సోషల్ మీడియాలో చూసే సమాచారం నిజమా కాదా అని ముందుగా నిర్ధారించుకోవాలి అని విజ్ఞప్తి చేసింది. నిర్ధారణలేని వార్తలను పంచడం సమాజంలో గందరగోళం సృష్టించవచ్చని హెచ్చరించింది
Read hindi news: hindi.vaartha.com
Read Also: