News Telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకారం మొత్తం 185 పోస్టులు భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని పట్ణణ ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ కేంద్రాల్లో ఒప్పంద ప్రాతిపదికన ఈ నియామకాలు జరగనున్నాయి.

పోస్టుల విభజన
ఈ ఉద్యోగాల్లో 155 మంది ఎంబీబీఎస్ వైద్యులు ఎంపిక చేయబడతారు. అదనంగా, 30 మంది స్పెషలిస్టులు, 13 మంది టెలిమెడిసిన్ హబ్ వైద్యులు, 3 మంది గైనకాలజిస్టులు, అలాగే 14 మంది చిన్న పిల్లల వైద్యులు (Pediatricians) నియమించబడతారని శాఖ తెలిపింది.
దరఖాస్తు ప్రక్రియ
ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 25, 2025 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 10, 2025 గా నిర్ణయించారు. అర్హతలు, దరఖాస్తు వివరాలు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌లో లభిస్తాయి.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం – ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు
తొలి విడత జాబితా విడుదల
ఇక మరోవైపు, ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం (NTR Health University)2025–26 విద్యా సంవత్సరానికి గాను ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల తొలి విడత కేటాయింపు జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను విజయవాడలో వర్సిటీ అధికారులు ప్రకటించారు. సీట్ల వివరాలను విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చు.
ఫీజు చెల్లింపు, డాక్యుమెంట్ల సమర్పణ
సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 25 మధ్యాహ్నం 3 గంటల నుంచి రూ.10,600 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. అనంతరం, వారికి కేటాయించిన సీట్ల పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సీట్లు పొందిన వారు ఆగస్టు 29 సాయంత్రం 4 గంటలలోపు తమ తమ మెడికల్ కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని వర్సిటీ సూచించింది.
తరగతుల ప్రారంభం
ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ తరగతులు సెప్టెంబర్ 5, 2025 నుంచి ప్రారంభం కానున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: