ప్రపంచ ప్రఖ్యాత కేంబ్రిడ్జ్ డిక్షనరీ (Cambridge Dictionary) ఇప్పుడు ఒక కీలక మార్పుకు శ్రీకారం చుట్టింది. ఇంటర్నెట్ ట్రెండ్‌ల ఆధారంగా కొత్త పదాలు చేర్చింది. ఇవి మామూలు పదాలు కావు, వైవిధ్యమైన, యువతలో ప్రాచుర్యం పొందినవి.యూట్యూబ్‌లో సంచలనం అయిన ‘స్కిబిడి’ ఇప్పుడు డిక్షనరీలో ఉంది. అర్థంలేని పదంగా కనిపించినా, అది జనరేషన్ జడ్‌కు పరిపరిచితమైన మాట. అదే విధంగా, ‘డెలులు’ (‘Delulu’) అనే పదం కూడా చేర్చబడింది. ఇది ‘డెలూషనల్’ అనే పదానికి చిన్న రూపం.సాంప్రదాయ విలువలను పాటించే మహిళలకు ఉపయోగించే ‘ట్రాడ్‌వైఫ్’ అనే పదం ఇప్పుడు అధికారికంగా ఉంది. ఇవన్నీ నేటి సోషల్ మీడియా సంభాషణల్లో విరివిగా వినిపించే మాటలు.

ఫ్యాషన్ నుండి ఇన్‌స్పిరేషన్ దాకా – కొత్త పదాల జాబితా
‘లూక్’ అనే పదం ప్రత్యేక ఫ్యాషన్ శైలికి సూచన. అదే విధంగా, ‘ఇన్‌స్పో’ అంటే ప్రేరణకు చిన్న రూపం. ఇవి సోషల్ మీడియా యూజర్ల మధ్య విస్తృతంగా వాడబడుతున్నాయి.వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతిలో, పని చేస్తున్నట్లు నటించేవారిని ‘మౌస్ జిగ్లర్’ అంటారు. ఇప్పుడు ఆ పదం డిక్షనరీలో కూడా స్థానం సంపాదించింది.చిరకాలం పర్యావరణంలో ఉండిపోయే హానికర పదార్థాలకు ‘ఫరెవర్ కెమికల్’ అనే పదాన్ని చేర్చారు. ఇది పర్యావరణంపై పెరుగుతున్న చింతనకు నిదర్శనం.
ఆన్‌లైన్ సంస్కృతి – భాషను ఎలా మారుస్తోంది?
కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రతినిధి కొలిన్ మెక్‌ఇంటోష్ మాట్లాడుతూ, “ఇలాంటి పదాలు నానాటికీ సాధారణమవుతున్నాయి,” అన్నారు. “వీటి ప్రాముఖ్యత తగ్గదని భావించి మాత్రమే చేర్చుతున్నాం” అని తెలిపారు.ఇంటర్నెట్ భాష, ముఖ్యంగా జనరేషన్ జడ్, ఆల్ఫా భాషా శైలులు, ఇప్పుడు అధికారికత సంతరించుకున్నాయి. భవిష్యత్‌లో మరిన్ని కొత్త పదాలు వచ్చేవేమో చూడాలి.నేటి యువత వాడే మాటలు, నేటి ట్రెండ్స్, డిక్షనరీలోకి ప్రవేశిస్తున్నాయి. ఈ దిశగా కేంబ్రిడ్జ్ చేసిన అడుగు భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయనుంది.
Read Also :