New ration cards for all eligible in AP soon

ఏపీలో అర్హులైన అందరికి త్వరలో నూతన రేషన్ కార్డులు

అమరావతి: రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే వాటిని మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబాల విభజన, అడ్రస్ మార్పు, కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి వాటిపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

Advertisements

రేషన్‌కార్డులు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ. 12 వేలు మించకుండా ఉండాలని గత ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రేషన్‌కార్డు కోల్పోయారు. ప్రభుత్వ పథకాలకు తామంతా దూరమయ్యామని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పరిమితిని పెంచి వారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీపైనా నిర్ణయం తీసుకోనుంది. ఖాళీగా ఉన్న ఆరువేల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.

Related Posts
కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి
Attack on Congress leader F

కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి జరిగింది. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే Read more

AndhraPradesh: ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి?
AndhraPradesh: ఏపీలో బర్డ్‌ఫ్లూతో రెండేళ్ల చిన్నారి మృతి?

ఆంధ్రప్రదేశ్‌లో తొలి బర్డ్‌ఫ్లూ (హెచ్5ఎన్1) వైరస్ మరణం నమోదైంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ వల్ల మరణించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎమ్ఆర్), Read more

బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు
బీఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ కార్యకర్తలు

వికారాబాద్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన కొడంగల్ నియోజకవర్గంలోని దౌలతాబాద్ మండలానికి చెందిన 30 మంది కార్యకర్తలు బుధవారం మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సమక్షంలో Read more

జగన్ కు షాక్ ఇచ్చిన మరో కీలక నేత
avanthi srinivas resigns ycp

గత ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రస్తుతం తీవ్ర కష్టాలను ఎదుర్కొంటోంది. కేవలం 11 సీట్లకే పరిమితమైన పార్టీని, పలువురు కీలక Read more