New ration cards for all eligible in AP soon

ఏపీలో అర్హులైన అందరికి త్వరలో నూతన రేషన్ కార్డులు

అమరావతి: రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు త్వరలోనే వాటిని మంజూరు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. రేషన్‌కార్డుల్లో పేరు మార్పు చేర్పులకు కూడా అవకాశం ఇవ్వనుంది. కుటుంబ సభ్యుల పేర్లు తొలగింపు, చేర్పు, కుటుంబాల విభజన, అడ్రస్ మార్పు, కార్డులను ప్రభుత్వానికి సరెండర్ చేయడం వంటి వాటిపైనా నిర్ణయం తీసుకోనున్నారు.

రేషన్‌కార్డులు పొందాలంటే గ్రామీణ ప్రాంతాల్లో రూ. 10 వేలు, పట్టణ ప్రాంతాల్లో నెలవారీ ఆదాయం రూ. 12 వేలు మించకుండా ఉండాలని గత ప్రభుత్వం నిబంధనలు విధించింది. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రేషన్‌కార్డు కోల్పోయారు. ప్రభుత్వ పథకాలకు తామంతా దూరమయ్యామని వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదాయ పరిమితిని పెంచి వారికి కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని వారంతా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దానిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. వాహనాల ద్వారా రేషన్ పంపిణీపైనా నిర్ణయం తీసుకోనుంది. ఖాళీగా ఉన్న ఆరువేల రేషన్ డీలర్ల ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కొత్తగా 4 వేలకు పైగా దుకాణాలు ఏర్పాటు చేయనున్నారు.

Related Posts
పీఈసెట్‌, ఎడ్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల
పీఈసెట్‌, ఎడ్‌సెట్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PECET) మరియు ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (EdCET) షెడ్యూల్‌ను ప్రకటించింది. Read more

కమ్యూనిటీ వెల్‌నెస్‌ను ప్రోత్సహించడానికి ‘ఫ్రీడం పార్క్’ని ప్రారంభించిన జీఈఎఫ్ ఇండియా
GEF India launched Freedom Park to promote community wellness

సమాజం యొక్క విభిన్న అవసరాలను తీర్చగల సమ్మిళిత , పర్యావరణ అనుకూల స్థలాలను ఫ్రీడమ్ పార్క్ సృష్టిస్తుంది Hyderabad: ఫ్రీడమ్ హెల్తీ వంట నూనెల తయారీదారులు, జెమిని Read more

రాహుల్ గాంధీపై పౌరసత్వ వివాదం…
Rahul Gandhi

ఈ మధ్య కాలంలో అలహాబాద్ హైకోర్టు హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఒక్కసారిగా జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ పిటిషన్ లో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ Read more

2030 నాటికి నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని నిర్మించడంపై దృష్టి సారించిన తెలంగాణ
Telangana Focused on Building Skilled Workforce by 2030 .EY Parthenon . CII Report

హైదరాబాద్ : నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ యొక్క డిమాండ్‌లకు అనుగుణంగా తెలంగాణ తన విద్యా వ్యవస్థను తీర్చిదిద్దడానికి పరివర్తనాత్మక చర్యలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *