Attack on Congress leader F

కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి

కాంగ్రెస్ లీడర్ ఫిరోజ్ ఖాన్ పై దాడి జరిగింది. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో ఎంఐఎం కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. సీసీ రోడ్డు పరిశీలనకు వచ్చిన ఆయన్ను ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ అనుచరులు అడ్డుకుని దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

నాంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ర‌హ‌దారి ప‌నులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఓ వృద్ధుడు గుంత‌లో పడడంతో తీవ్ర గాయాల‌య్యాయి. దీంతో ర‌హ‌దారిపై గుంత‌లు, త‌న‌కు త‌గిలిన గాయంపై కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్‌కు వృద్ధుడు తెలిపాడు. దీంతో ఫిరోజ్ ఖాన్ ర‌హ‌దారి ప‌నులను ప‌రిశీలించేందుకు వెళ్లాడు. విష‌యం తెలుసుకున్న ఎంఐఎం ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్‌తో పాటు ఆయ‌న వ‌ర్గీయుల్లో ఆగ్రహం క‌ట్ట‌లు తెంచుకుంది. అంతే ఒక్కసారిగా ఫిరోజ్ ఖాన్ పై దాడి చేసారు. దీంతో ఇరు వ‌ర్గాల మ‌ధ్య ప‌ర‌స్ప‌రం రాళ్ల దాడి జ‌రిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వ‌ర్గాల‌ను చెద‌ర‌గొట్టారు.

ఫిరోజ్ ఖాన్ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాంపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. చివరి వరకు తన గెలుపు ఖాయమంటూ ఫిరోజ్ ధీమాగా ఉన్నారు. కానీ చివరికి స్థానిక ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయాన్ని అందుకున్నారు. అది కూడా కేవలం 1500 ఓట్లతో ఫిరోజ్ ఖాన్ ఓటమిని చవి చూడాల్సి వచ్చింది.

Related Posts
జైలు శిక్ష పై వర్మ కామెంట్స్..
varmacase

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మకు ముంబైలోని అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. చెక్ బౌన్స్ కేసులో ఏకంగా వర్మకు మూడు నెలల Read more

బిఆర్ఎస్ నేతలతో కేసీఆర్ కీలక అంశాలపై చర్చ
kcr erravalli

తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామంగా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఎర్రవెల్లిలో పార్టీ నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధానంగా బీఆర్ఎస్ Read more

నేడు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
Hemant Soren took oath as Jharkhand CM today

రాంచీ: నేడు జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పగ్గాలు చేపట్టబోతున్నారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంగా అట్టహాసంగా జరగబోతోంది. జార్ఖండ్ 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గురువారం Read more

ఆలపాటి రాజా భారీ విజయం
Alapati Raja

గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. ప్రారంభ నుంచే ఆధిక్యంలో ఉన్న ఆయన చివరి వరకు అదే Read more