New Income Tax Bill in Budget Sessions

బడ్జెట్‌ సమావేశాల్లో కొత్త ఆదాయం పన్ను బిల్లు

న్యూఢిల్లీ: జనవరి 31 నుండి పార్లమెంట్‌ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే వచ్చే బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ‘కొత్త ఆదాయం పన్ను బిల్లును ప్రతిపాదించనున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఆదాయం పన్ను చట్టాన్ని సరళతరం చేసి కొత్త చట్టం తీసుకొస్తారు. ఐటీ రిటర్న్స్‌ దాఖలు చేసే పేజీల సంఖ్యను సుమారు 60శాతం తగ్గించి, సమగ్ర ఆదాయం పన్ను చట్టం రూపొందిస్తారు. ప్రస్తుతం ముసాయిదా బిల్లు కేంద్ర న్యాయశాఖ పరిశీలనలో ఉంది. మలి విడత బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశ పెడతారని తెలుస్తున్నది.

2024 జూలైలో 2024-25 ఆర్థిక సంవత్సర పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. ఆరు నెలల్లో పాత ఆదాయం పన్ను చట్టం-1961పై సమగ్రంగా సమీక్షిస్తామని ప్రకటించారు. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశ పెడతారు. కొత్త ఆదాయం పన్ను చట్టం రూపొందిస్తారు తప్ప ప్రస్తుత చట్టానికి సవరణలు కాదని అధికార వర్గాలు తెలిపాయి.

image
image

బడ్జెట్‌ పార్లమెంట్‌ సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకూ జరుగుతాయి. ఈ నెల 31న పార్లమెంట్‌ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించడంతో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు మొదలవుతాయి. తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకూ కొనసాగుతాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2025-26 సంవత్సరానికి బడ్జెట్‌ సమర్పిస్తారు. మార్చి 10 నుంచి ఏప్రిల్‌ నాలుగో తేదీ వరకూ మలి విడుత బడ్జెట్‌ సమావేశాలు జరుగుతాయి. ఈ బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదిస్తే చట్టంగా మారుతుంది.

పాత కాలం నాటి ఆదాయం పన్ను చట్టం -1961పై సమీక్షించి సమగ్ర నివేదిక తయారు చేయడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఒక అంతర్గత కమిటీ నియమించింది. సంక్షిప్తంగా, స్పష్టంగా తేలిగ్గా అర్ధం చేసుకునే విధంగా ప్రతిపాదిత బిల్లు ఉంటుంది. వివాదాలు, వ్యాజ్యాలు తగ్గించడానికి పరిష్కార మార్గాలు ప్రతిపాదిస్తారు. పాత ఆదాయం పన్ను చట్టంలోని వివిధ అంశాలను సమీక్షించేందుకు 22 స్పెషలైజ్డ్‌ సబ్‌ కమిటీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చట్టం సమీక్షించడానికి ప్రజల నుంచి 6500 సూచనలు వచ్చాయి. ప్రస్తుతం చట్టం 298 సెక్షన్లు, 23 చాప్టర్లు కలిగి ఉంది. ప్రత్యక్ష పన్నులకు సంబంధించిన ఆదాయం పన్ను చట్టం-1961లో వ్యక్తిగత ఆదాయం పన్ను, కార్పొరేట్‌ పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ టాక్స్‌, గిఫ్ట్‌ టాక్స్‌, వెల్త్‌ టాక్స్‌ వస్తాయి.

Related Posts
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం: ఎస్.ఎస్.వి స్క్రాప్ పరిశ్రమలో మంటలు
fire accident jeedimetla

హైదరాబాద్ జీడిమెట్లలోని ఎస్.ఎస్.వి స్క్రాప్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం మంగళవారం మధ్యాహ్నం వెలుగు చూసింది. ఈ అగ్నిప్రమాదం ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీకి సంబంధించిన పరిశ్రమలో Read more

రేపు కేంద్ర కేబినెట్ భేటీ..
Central cabinet meeting tomorrow

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతన రేపు (బుధవారం) కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 10:30 గంటలకు జరుగనున్న ఈ కేంద్ర కేబినెట్ మీటింగులో పలు కీలక Read more

విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మృతి.. అమెరికా వెల్లడి..!
A total of 67 people died in the plane crash.. America revealed.

వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన వాషింగ్టన్ విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మరణించినట్టు అమెరికా ప్రకటించింది. వాషింగ్టన్ లోని Read more

గ్యాస్ వినియోగదారులకు చంద్రబాబు మరో గుడ్ న్యూస్
CM Chandrababu held meeting with TDP Representatives

CM చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించిన సందర్భంగా లబ్ధిదారులకు ఇచ్చిన సందేశంలో, మహిళలు ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా సిలిండర్లు అందించడానికి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *