భారత సైన్యం (Indian Army) త్వరలోనే సబ్ మెషిన్ గన్‌లలో మార్పులు చేపట్టనుంది. ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న 1940ల్లో రూపొందించిన స్టెర్లింగ్ కార్బైన్‌లను సైన్యం రిటైర్ చేయనుంది. వాటికి బదులుగా, కొత్తగా అభివృద్ధి చేసిన క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ (CQB) కార్బైన్‌లను అందించేందుకు సన్నద్ధమవుతోంది.ఈ నూతన గన్‌ల తయారీ కోసం డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), భారత్ ఫోర్జ్ లిమిటెడ్‌లతో సైన్యం ఒప్పందం కుదుర్చుకుంది. రూ.2వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుకు డీఆర్డీవో, భారత్ ఫోర్జ్ లిమిటెడ్‌లు ఎల్-1 బిడ్డర్లుగా ఎంపికయ్యాయి. తయారీ బాధ్యతను కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ నిర్వహించనుంది.
పరిశోధనలో నుంచే ఉత్పత్తి వరకు
ఈ కార్బైన్ 5.56×45 మిల్లీమీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనిని పూణేలోని డీఆర్డీవో ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ARDE) అభివృద్ధి చేసింది. అనంతరం భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ అయిన కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ ఉత్పత్తిని చేపట్టనుంది.ఈ కార్బైన్‌లు పరిమాణంలో చిన్నగా ఉంటాయి. తక్కువ బరువుతో ఉంటేనేగానీ వాటి పనితీరు గణనీయంగా ఉంటుంది. వీటిలో ఆప్టిక్స్, లేజర్ డిజిగ్నేటర్స్ వంటి ఆధునిక యాక్సెసరీస్ అమర్చబడ్డాయి. దీంతో దాడుల సమయంలో సైనికులు త్వరితంగా స్పందించగలుగుతారు.
యుద్ధ పరిస్థితులకు అనుగుణంగా
ఇప్పటి యుద్ధ పరిస్థతుల్లో నిఖార్సైన లక్ష్యాన్ని చేరుకోవడమే ముఖ్యం. అందుకే ఈ గన్‌లు చాలా కీలకంగా మారాయి. ప్రత్యేకంగా క్లోజ్ క్వార్టర్ యుద్ధాల్లో ఇవి వినియోగించేందుకు సరిపోతాయి. స్టెర్లింగ్ కార్బైన్‌లు ఈ అవసరాలకు తక్కువగా అనిపించడంతో సైన్యం కొత్త మార్గాన్ని ఎంచుకుంది.
లక్షల సంఖ్యలో ఉత్పత్తి
ఈ ఒప్పందం కింద దాదాపు నాలుగు లక్షలకు పైగా CQB గన్‌లు తయారవుతాయి. త్వరలోనే ఇవి భారత సైనికుల చేతికి రానున్నాయి. ఇది సైనికుల రక్షణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచనుంది.దేశ భద్రతను పటిష్టం చేయడంలో ఇదొక మైలురాయిగా నిలవనుంది. ఆధునిక ఫీచర్లతో కూడిన ఈ కార్బైన్‌లు భారత సైనికుల చేతికి రాగానే, వారి క్రియాశీలత, స్పందన వేగమయ్యే అవకాశముంది.
Read Also : Raja Singh: బండి సంజయ్‌పై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు.. రాజాసింగ్ ఏమన్నారంటే?