ఆన్లైన్ షాపింగ్‌ను మరింత సులభంగా చేయాలన్న లక్ష్యంతో గూగుల్ మరో కీలక ముందడుగు వేసింది.గూగుల్ I/O 2025’లో కొత్త AI ఆధారిత షాపింగ్ (New AI-powered shopping at Google I/O 2025) టూల్స్‌ను పరిచయం చేసింది.ఈ ఫీచర్లు వినియోగదారుల షాపింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేలా ఉన్నాయి.జెమినీ AI టెక్నాలజీ, గూగుల్ షాపింగ్ గ్రాఫ్‌ను వీటి పునాదిగా ఉపయోగించారు.ఈ గ్రాఫ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తుల గురించి పూర్తి సమాచారం ఉంటుంది.ధర,రంగు, స్టాక్ లభ్యత, సమీక్షలు మొదలైనవి ఇందులో చోటు చేసుకున్నాయి.ప్రతి గంటకూ ఈ డేటా అప్‌డేట్ అవుతోంది.రోజుకు 2 బిలియన్ల అప్‌డేట్స్‌తో వినియోగదారులకు తాజా సమాచారం అందుతుంది.ఏదైనా వస్తువు గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే,AI ఆ ఉత్పత్తిని మీ అభిరుచులకు అనుగుణంగా చూపిస్తుంది.బడ్జెట్,ఉపయోగం, ఫీచర్లపై క్లియర్ సలహాలు (Clear suggestions on features) అందిస్తాయి.ట్రాక్ ప్రైస్’బటన్ వలన మీరు నచ్చిన వస్తువు ధర తగ్గితే అలర్ట్ వస్తుంది.అలాగే మీరు కోరిన సైజు, రంగు కూడా ఎంచుకోవచ్చు.ఆ తర్వాత గూగుల్ పేతో సురక్షితంగా కొనుగోలు (Buy securely with Google Pay) పూర్తి చేయవచ్చు.

వర్చువల్ ట్రై-ఆన్ తో షాపింగ్ సరదాగా
ఈసారి గూగుల్ అందించిన పెద్ద ఫీచర్ – వర్చువల్ ట్రై-ఆన్.మీరు మీ ఫోటోను అప్‌లోడ్ చేస్తే, దుస్తులు ట్రై చేయడం కష్టం కాదు. ఇది AI image మోడల్ ఆధారంగా పనిచేస్తుంది.మీ శరీర ఆకృతిని గుర్తించి, దుస్తులు ఎలా నచ్చుతాయో చూపిస్తుంది.ప్రస్తుతం ఇది షర్ట్స్, డ్రెస్సులు, స్కర్ట్స్, ప్యాంట్స్‌కి అందుబాటులో ఉంది.ట్రై చేసిన ఫోటోలను సేవ్ చేసి, ఫ్రెండ్స్‌తో పంచుకోవచ్చు.
మొదట అమెరికాలో, త్వరలో మరిన్ని దేశాల్లో
AI మోడ్‌తో షాపింగ్,వర్చువల్ ట్రై-ఆన్ మొదట అమెరికాలో లభించనుంది.’సెర్చ్ ల్యాబ్స్’ ద్వారా కొంతవరకు అందుబాటులో ఉంది.షాపింగ్‌ను సరళం చేయడంలో ఇది గణనీయమైన ముందడుగు.గూగుల్ ప్రొడక్ట్ వైస్ ప్రెసిడెంట్ లిలియన్ రిన్‌కాన్ మాట్లాడుతూ,“వినియోగదారులకు సరైన ధరలో సరైన ఉత్పత్తులు కనుగొనడంలో ఇది ఎంతో సహాయపడుతుంది” అన్నారు.
భవిష్యత్తు షాపింగ్ ఇదే!
ఈ కొత్త AI ఫీచర్లతో షాపింగ్ అనుభవం ఇక ముందెన్నడూ లేనంత స్మార్ట్‌గా మారనుంది.గూగుల్ ఆశిస్తున్నదే – వినియోగదారులు సమయాన్ని,డబ్బును ఆదా చేయాలి.ఒకే చోట పూర్తిస్థాయి సమాచారం,ఆలోచించకుండా కొనుగోలు చేసే ఆ అవకాశం ఇప్పుడు నిజం కాబోతుంది.
Read Also : Texas Tornado : ఉత్తర టెక్సాస్‌లో భారీ వడగళ్ల వర్షం