हिन्दी | Epaper
అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ అఖండ 2 సినిమా కలెక్షన్లు ఎన్ని కోట్లంటే? ఓటీటీలోకి రాజు వెడ్స్ రాంబాయి’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ‘అఖండ 2’ మూవీ రివ్యూ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోన్న ‘అఖండ 2’ కృతి సనన్ పై మహేష్ అభిమానుల ఆగ్రహం… వీకెండ్ బ్లాక్‌బస్టర్ ‘దురంధర్’ ‘అఖండ 2’ విడుదల వాయిదా ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్

ఆలియా భట్ సంచలన నిర్ణయం

Anusha
ఆలియా భట్ సంచలన నిర్ణయం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి కూతురు రాహా కపూర్ ఫోటోలన్నింటినీ తొలగించడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను, ముఖ్యంగా కూతురు రాహా ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చిన ఆలియా, అనూహ్యంగా వీటిని డిలీట్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇన్‌స్టాగ్రామ్ నుంచి రాహా ఫొటోలు డిలీట్

ఆలియా భట్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో పంచుకుంటుంది. ముఖ్యంగా తన ముద్దుల కూతురు రాహా కపూర్ ఫోటోలు, వీడియోలను తరచూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాయి. ఇవి క్షణాల్లోనే తెగ వైరలవుతుంటాయి. అలియా స్వయంగా తన కూతురి ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఆలియా ఉన్నట్లుండి తన కూతురి ఫోటోలన్నింటినీ ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించింది. 

భద్రత

ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం భద్రతకు సంబంధించిన అంశమేనని భావిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి తర్వాత అలియా కూడా అప్రమత్తమై ఉండవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. జనవరి 16న, ఓ గుర్తు తెలియని వ్యక్తి సైఫ్, కరీనా ఇంట్లోకి ప్రవేశించి, సైఫ్‌పై కత్తితో దాడి చేయగా, ఆయన తీవ్రంగా గాయపడ్డారు. వ్యక్తి సైఫ్‌ను ఆరుసార్లు కత్తితో పొడిచాడు. ఆ తర్వాత, సైఫ్ అలీ ఖాన్ తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరాడు. 

నో ఫోటో పాలసీ

సైఫ్-కరీనా తమ పిల్లలు తైమూర్, జెహ్ కోసం ‘నో ఫోటో పాలసీ’ను అమలు చేశారు. ఇదే కోవలో ఆలియా కూడా తన కూతురు రాహా భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.దీంతో ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

New Project 2025 03 01T143123555 enhanced 67c2cd185cf7e

అభిమానులలో కొంతమంది ఈ నిర్ణయాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నప్పటికీ, చాలామంది దీన్ని సమర్థిస్తున్నారు. ప్రముఖ సెలబ్రిటీ పిల్లల వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని, భద్రతను దృష్టిలో ఉంచుకొని అలియా తీసుకున్న నిర్ణయం సరైనదేనని కొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో, బాలీవుడ్‌లో ప్రముఖ సెలబ్రిటీల పిల్లల ప్రైవసీపై పెద్ద చర్చ మొదలైంది.అలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్‌లో అగ్ర నటి కాబట్టి, ఆమె కూతురు రాహా కపూర్ కూడా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. రాహా కపూర్ ప్రస్తుతం స్టార్ కిడ్ గా గుర్తింపు తెచ్చుకుంది. తన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు అలియా, రణబీర్ రహా కోసం ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అలియా ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఆమె అభిమానుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. తన అభిమానులతో టచ్‌లో ఉండటానికి అలియా నిరంతరం రాహ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అభిమానులు కూడా నటి ప్రతి పోస్ట్‌కు లైక్‌లు, కామెంట్ వర్షం కురిపిస్తుంటారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870