Nayab Saini will take oath as Haryana CM tomorrow

హర్యానా సీఎంగా నాయబ్ సైని రేపు ప్రమాణ స్వీకారం

హర్యానా: హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనికి బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది. ఈరోజు జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో సైనిని శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, పార్టీ సీనియర్ నేత అనిల్ విజ్ ఆయన పేరును ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

నాయబ్ సింగ్ సైని రేపు హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ పరిశీలకులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ హాజరయ్యారు. సైనికి వారు శుభాకాంక్షలు తెలిపారు.

రేపటి ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న హర్యానాలో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 37 సీట్లలో గెలిచింది.

Related Posts
హిందువులకి మోహన్ భగవత్ హెచ్చరిక !
ప్రపంచానికి మేలు చేయలేకపోతున్నారనే అర్దం వచ్చేలా భగవత్ వ్యాఖ్యలు చేసారు

 భారత్ లో హిందువుల గురించి తరచుగా ఏదో ఒక వ్యాఖ్యతో వార్తల్లో నిలిచే ఆరెస్సెస్ ఛీఫ్ మోహన్ భగవత్ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు.  కొన్ని నెలలుగా Read more

బెంగళూరులో పొడవైన యూ-గర్డర్ ఆవిష్కరణ!
bengaluru

దేశంలోనే అతిపొడవైన యూ-గర్డర్ (సిమెంట్ దూలం)ను బెంగళూరులోని సబర్బన్ రైల్ కారిడార్‌లో ఉపయోగించారు. బెంగళూరు సబర్బన్ రైల్వే ప్రాజెక్టులో భాగంగా 31 మీటర్ల పొడవైన ఈ గర్డర్‌ను Read more

రన్యారావు విచారణలో సంచలన విషయాలు వెల్లడి
రన్యారావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి

బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు వివిధ వివాదాల్లో ఇరుక్కోవడం గతంలో ఎన్నోసార్లు చూశాం. తాజాగా కన్నడ నటి రన్యారావు పేరు స్మగ్లింగ్ కేసులో తెరపైకి Read more

ఎమ్మెల్సీ లను అభినందించిన నరేంద్ర మోదీ
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై మోదీ స్పందన

తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటింది. బీజేపీ తరఫున పోటీ చేసిన మల్క కొమరయ్య, అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. Read more