అస్సాం ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ (Zubeen Garg) ఇటీవలే మరణించిన విషయం తెలిసిందే. సింగపూర్ వెళ్లిన జుబీన్ అక్కడ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మృతిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన ప్రకటన చేశారు. జుబీన్ ప్రమాదంలో చనిపోలేదని.. ఆయన హత్య కు గురయ్యారంటూ అసెంబ్లీలో వెల్లడించారు. గాయకుడి మృతిపై చర్చించేందుకు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానం సందర్భంగా సీఎం ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. ‘జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ మరణించలేదు. ఆయన్ని హత్య చేశారు’ అని వ్యాఖ్యానించారు.
Read Also: http://Kiren Rijiju: డిసెంబర్ 1 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు

52 ఏండ్ల సింగర్ జుబీన్ గార్గ్ (Zubeen Garg) సెప్టెంబర్ 19న సింగపూర్‌లో ప్రమాదవశాత్తూ మరణించిన విషయం తెలిసిందే. స్కూబా డైవింగ్ సందర్భంగా చోటుచేసుకున్న ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన మరణంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో సింగర్ మృతిపై సీఎం హిమంత బిశ్వ శర్మ దర్యాప్తునకు ఆదేశించారు. డీజీపీ ఎంపీ గుప్తా నేతృత్వంలో 10 మందితో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. జుబీన్ సన్నిహితులు, మేనేజర్ సహ అనుమానితులపై సిట్ దృష్టి సారించింది. ప్రమాద సమయంలో అక్కడున్న వారిపై నిఘా పెట్టారు. ఈ కేసులో జుబీన్ మేనేజర్, వ్యక్తిగత భద్రతా సిబ్బంది సహా పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Read hindi news :hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: